మృగరాజుల విందు.. బాటసారుల కనువిందు.. Pride Of Lions Block Road While Eating Hunt

Pride of lions block road while eating hunt

caterstv, viral, clips, pride of lions, lions, lions eating hunt, hunting, buffalo, Kruger National Park, drivers, tailback, South Africa

This is the moment a pride of lions brought traffic to a standstill at Kruger National Park in South Africa.

ITEMVIDEOS: మృగరాజుల విందు.. బాటసారుల కనువిందు..

Posted: 01/28/2017 07:06 PM IST
Pride of lions block road while eating hunt

అడవికి రాజులు. మృగాలలో రారాజులుగా వెలుగొందుతున్న సింహాన్ని చూడాటానికి రెండు కనులు కూడా చాలవు. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ జెనిలియాకు చూపించినట్లుగా.. ఒక్కసారిగా మనముందుకు మృగరాజు వస్తే.. దాన్ని చూడగానే మన గుండె అగినంత పని అవుతుంది. కానీ మన ప్రాణాలకు ఢోకా లేదని తెలిసిన తరువాత వాటిని చూడాలంటే.. మాత్రం ఎవరికి ఇష్టం వుండదు. ఠీవిగా నడుస్తూ వెళ్ళే సింహంలో కనిపించే రాజసాన్ని చూసి తీరవలసిందే.

దాని ఆకారం, సన్నని నడుము ఆకర్షణీయంగా ఉంటాయి. ఒక సింహాన్ని చూసినపుడే ఎంతో ఆనందం కలుగుతంది. అయితే సింహాల గుంపు మనం వెళ్లే దారిలో ఉంటే.. హమ్మో అంటూ కేకేస్తాం. సరిగ్గా అలాగే జరిగింది. దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్కులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 సింహాల గుంపు రోడ్డుపై బైఠాయించాయి, ఆకటితో వున్న మృగరాజులు అప్పుడే ఒక అడవి దున్నను వేటాడి రోడ్డుపైనే తమ ఆహారాన్ని తిన్నాయి. ఇక వాటిని చూసినపుడు కలిగే సంతోషం అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. బెడ్‌ఫోర్డ్‌వ్యూకు చెందిన ఓ వృద్ధ జంట ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు

18 సింహాలు రోడ్డుపైన ఓ దున్నపోతును తింటూండటాన్ని షౌన్ రైట్ (60), ఆయన భార్య రోజ్ మేరీ చూశారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషించారు. వెంటనే ఆ సన్నివేశాలను చిత్రీకరించారు. క్రూగర్ నేషనల్ పార్క్‌కు ఆ జంట ఏటా వస్తూంటుంది. కానీ ఈ ఏడాది ఇంత అపురూపమైన సంఘటన జరుగుతుందని వారు ఊహించలేదు. దీనిని తాము ఎప్పటికీ మర్చిపోయేది లేదంటున్నారు. అదే సమయంలో ఆ రోడ్డుపైకి వచ్చిన కార్లు దూరంగా ఆగిపోయాయని వారు చెప్పారు. మృగరాజులను దాటుకుని వెళ్ళే సాహసం ఎవరూ చేయలేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles