మెరినాను వదలని తంబీలు.. ప్రధాని ట్విట్లు.. President To Approve Order Allowing Jallikattu, PM Modi

President to approve order allowing jallikattu pm narendra modi

Narendra Modi, Pranab Mukherjee, Jallikattu, Jallikattu protest Chennai, Jallikattu Protest, CM Panneerselvam, Tamil Nadu, O Pannerselvam, marina beach, dmk fasting, chennai

PM Modi has said that all efforts are being made to fulfil the cultural aspirations of Tamil people, a day after ordinance by the state, which allows the bull-taming sport of Jallikattu, was cleared by the centre.

మెరినాను వదలని తంబీలు.. ప్రధాని ట్విట్లు..

Posted: 01/21/2017 10:51 AM IST
President to approve order allowing jallikattu pm narendra modi

తమ నిరసనలు, అందోళనల నేపథ్యంలో ఏకంగా కేంద్ర ప్రభుత్వమే దిగివచ్చింది. తమిళనాడు సర్కార్ పంపిన నమూనా అర్డినెన్స్ కు స్వల్ప సవరణలు చేసి దానిని అమోదించి, రాజముద్ర కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు పంపింది. ఈ వార్త తెలిసి మెరినా బీచ్ లో సంబరాలు ప్రారంభమయ్యాయి. బాణాసంచా పేలింది. స్వీట్లు పంచుకున్నారు. తమ సంస్కృతిని కేంద్రం గౌరవించిందని హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇంతలోనే నిరసనకారుల్లో అనుమానాలు వెల్లువెత్తాయి.

తమ నిరసనను చల్లార్చేందుకు ఇదంతా కేంద్రం వేసిన ఎత్తుగడా..? అన్న సందేహాలు ఉత్పన్నమయ్యాయి, అయితే రాష్దపతి రాజముద్ర వేసేంత వరకు అడుదాం అంటూ నిరసనకారలు మెరినా బీచ్ ను వదల్లేదు. రాత్రికి రాత్రి ఒక్కసారిగా సంబరాలు జరుపుకున్న తమిళ తంబీలు మన్సుసులను మర్చుకున్నారు. ఈ మార్పులను తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించింది మాద్యమాలే. ఒక్కటి రాష్ట్రంలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కాగా, రెండోవది విశ్వవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుతున్న సోషల్ మీడియా.

జల్లికట్టుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసినా నిరసనకారులు వెనక్కి వెళ్లలేదు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్షలు మానలేదు. కేంద్రం జల్లికట్టుకు పచ్చజెండా ఊపుతామని ప్రకటించినా.. ఎందుకలా జరుగుతోంది? వాస్తవానికి జల్లికట్టు ఆర్డినెన్సు మీద చాలామందికి అనుమానాలున్నాయి. భారీ ఎత్తున వెల్లువెత్తిన నిరసన జ్వాలలను చల్లార్చేందుకు మాత్రమే ఏదో కంటి తుడుపు చర్యగా ఈ ఆర్డినెన్సు జారీ చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అందుకే.. ఆర్డినెన్సు కాపీ తమకు చూపించడంతో పాటు.. రాష్ట్రంలో జల్లికట్టు నిర్వహించాలని, ఆ తర్వాత మాత్రమే తాము ఇక్కడినుంచి కదిలి వెళ్తామని మెరీనా బీచ్‌ వద్ద గత ఐదు రోజులుగా నిరసన తెలియజేస్తున్న యువత చెబుతున్నారు. దీంతొ ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ తమిళ రాష్ట్ర వాసులు తమ నిరసనలను నిలిపివేయాలని కోరారు. కేంద్రం అమోదించిన ఆర్డినెన్సుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ త్వరలోనే రాజముద్రనే వేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి అమోదం పోందగానే జెల్లికట్టుపై ఉత్తర్వులను కూడా అలస్యం లేకుండా జారీ చేస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh