ఎస్సై, సీఐని తిట్టిన కేసులో లొంగిపోయిన బాలకృష్ణ.. బెయిల్ పై విడుదల | MLA Balakrishna surrenders to police.

Mla hd balakrishna surrenders to karnataka police

Magadi MLA, JD(S) MLA Balakrishna , MLA HC Balakrishna, Balakrishna surrender Court, Balakrishna got bail, Balakrishna Police Custody, Balakrishna surrenders to police

JD(S) MLA HC Balakrishna surrenders to Karnataka police. Later Magadi MLA, four of his associates get bail.

అసభ్యపదజాలం కేసు.. లొంగిపోయిన బాలకృష్ణ

Posted: 01/21/2017 11:56 AM IST
Mla hd balakrishna surrenders to karnataka police

పోలీస్ అధికారులను అసభ్యపదజాలంతో దూషించిన కేసులో ఎమ్మెల్యే బాలకృష్ణ కోర్టులో లొంగిపోయాడు. కర్ణాటక మాగడి ఎమ్మెల్యే బాలక‌ృష్ణ కొద్దిరోజుల క్రితం ఎస్ఐ, సీఐ లను దూషించాడు. దానిపై కేసు కూడా నమోదు అయ్యింది. తనను అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారన్న విషయం తెలుసుకున్న బాలకృష్ణ తన లాయర్ తో కలిసి ఒకటవ జేఎంఎఫ్ సీ కోర్టులో లొంగిపోయాడు.

మాగడి తాలూకాలోని అయ్యండనహళ్లిలో ఇటీవల జరిగిన జాతరలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే, ఈ ఘటనలో తమ పార్టీకి చెందిన వారిపై దాడులకు పాల్పడ్డారని, నిందితులను అరెస్టు చేయలేదంటూ కూదురు పోలీస్ స్టేషన్ వద్ద బాలకృష్ణ పెద్ద రాద్ధాంతం చేశాడు.

ఈ క్రమంలో తనను అడ్డుకోవాలని చూసిన ఎస్ఐ, సీఐలను బండబూతులు తిట్టాడు. తన నలుగురు అనుచరులతో దౌర్జన్యానికి దిగాడు. తాము ఎంతో రిస్క్ తీసుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చామని, అయినా కూడా ఎమ్మెల్యే తమపై నోరు పారేసుకున్నాడని జిల్లా ఎస్పీ రమేశ్ కు కూదూరు సీఐ నందీశ్ ఫిర్యాదు చేశాడు. దీంతో, సదరు ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయటం, అరెస్ట్ వారెంట్, ఆపై లొంగుబాటు జరిగిపోయాయి. ఎమ్మెల్యేతోపాటు ఆయన నలుగురి అనుచరులకు కూడా బెయిల్ లభించటంతో విడుదలయ్యారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA Balakrishna  derogatory  Case  Surrender  Bail  

Other Articles