ఈ అభిమానిని పాకిస్తాన్ ఏం చేస్తుందో..? BSF soldier whose videos went viral shifted

Bsf jawan s video exposes the mess caused by corruption

army, army corruption, bsf, bsf jawan, jawan video, basf jawan video, army man video, jawan viral video, corruption army

The videos expose the dismal state of affairs in the Armed force and the hardships our soldiers face everyday due to the "corrupt practices" of their own officers.

ITEMVIDEOS: రచ్చ రచ్చ.. బీఎస్ఎఫ్ జవాను వీడియో.. మెంటలోడేనా..?

Posted: 01/10/2017 04:16 PM IST
Bsf jawan s video exposes the mess caused by corruption

తమకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని పేర్కొంటూ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సుకు చెందిన జవాజు సోషల్ మీడియాలో ఫోస్టు చేసిన వీడియో సంచలనంగా మారింది. జమ్మూకశ్మీర్ లోని సరిహద్దు భద్రతా దళంలోని 29వ బెటాలియన్ కి చెందిన తేజ్ బహదూర్ యాదవ్ అనే సైనికుడు.. వారు పడుతున్న కష్టాలన్నింటినీ ఏకరువు పెడుతూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం జవాన్ల కోసం వెచ్చించిన నిధులను పై అధికారులు తినేస్తున్నారని యాదవ్ ఆరోపించారు. మాడిన రొట్టె, పసుపు రసం, సాంబార్ మాత్రమే ఆహారంగా ఇస్తున్నారని వీడియోలో చిత్రీకరించి మరీ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. తమ దీనగాథపై ప్రధాని మోదీ స్పందించాలని యాదవ్ వీడియోలో కోరారు. యాదవ్ పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవ్వడంతో కొద్దిసేపటికే ఆ వీడియోలు మీడియాల్లో దర్శనమిచ్చాయి. ఈ వీడియోలు ప్రసారమయ్యే సమయానికే తనపై సీనియర్ అధికారులు వేటు వేసే అవకాశం ఉందనే అనుమానాన్ని కూడా యాదవ్ వ్యక్తం చేశారు.

సరిహద్దులో చలిలో విధులు నిర్వహిస్తున్న తమకు నాసిరకం ఆహారాన్ని పెడుతున్న వైనాన్ని వీడియోల్లో చిత్రీకరించి బయటి ప్రపంచానికి తెలిసేలా చేశాడు యాదవ్. సోషల్ మీడియాల్లో ఈ వీడియోను చూసిన వారందరూ తేజ్ బహదూర్ యాదవ్ కు మద్దతుగా నిలిచారు. దీనిపై బీఎస్‌ఎఫ్) ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ డి.కె. ఉపాథ్యాయ కూడా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సైనికులకు అందించే బోజనం ఏమంత బాగుండదన్న విషయాన్ని అంగీకరించారు.

‘మన సైనికులకు అందించే భోజనం ఏమంత బాగుండదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. పైగా ఇది చలికాలం కాబట్టి కొన్ని ఇబ్బందులు తప్పవు. అయితే ఇప్పటివరకు ఈ విషయంలో ఏ ఒక్కరూ ఫిర్యాదు చెయ్యలేదు. బీఎస్‌ఎఫ్‌ చరిత్రలోనే మొదటిసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో అందరం షాకయ్యాం! నిజానికి ఇదొక సున్నితమైన అంశమైనందున ముందుకుముందే ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం. సమగ్ర దర్యాప్తు తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’అని ఐజీ ఉపాథ్యాయ తెలిపారు.

నిజాన్ని బయటపెట్టినందుకు క్రమశిక్షణా చర్యలా..?
 
బోజనంపై తేజ్ బహదూర్ యాదవ్ తర పోస్ట్‌ ద్వారా అందరూ జవాన్లు ఎదుర్కోంటున్న సమస్యను వెలుగులోకి తీసుకురావడంతో నాణ్యతతో కూడిన జోజనాన్ని అందించేందుక బదులుగా అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు యోచిస్తున్నారన్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. డ్యూటీలో ఉండగా అతను మొబైల్‌ ఫోన్‌ ఎందుకు తీసుకెళ్లాడు? అనేది వివాదాస్పదమైంది. ‘బీఎస్‌ఎఫ్‌ నియమావళి ప్రకారం డ్యూటీలో ఉండే జవాన్లు మొబైల్‌ ఫోన్లు వినియోగించకూడదు. తేజ్‌ బహదూర్‌ ఆ నిబంధనలను అతిక్రమించి మొబైల్‌ను వినియోగించాడని అతనిపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు అధికారులు.

స‌ర్వీసులో చేరిన‌నాటి నుంచే అంద‌రికీ ఇబ్బంది క‌లిగేలా వ్యవ‌హ‌రించేవాడ‌ని, క్రమం త‌ప్పకుండా అత‌నికి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్లమ‌ని అధికారులు పేర్కొన్నారు. 20 ఏళ్ల యాద‌వ్ సర్వీస్ లో నాలుగు సార్లు క్రమ‌శిక్షణ త‌ప్పి ప్రవ‌ర్తించిన‌ట్లు రికార్డుల్లో న‌మోద‌య్యాయ‌న్నారు. అందుకే అత‌నికి ఇప్పటి వ‌ర‌కు ప్రమోష‌న్ రాలేద‌ని వివ‌రించారు. ప్రమోష‌న్ లేక విసిగి చెందిన జ‌వాన్ ఈ కొత్త నాట‌కానికి తెర‌తీశాడ‌ని అధికారులు మండిప‌డ్డారు. అతను మద్యం మత్తులో ఉన్నాడని.. ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఈ ఆరోపణలు చేసినట్లు వివరణ ఇచ్చారు.

అయితే నెట్ జనులు మాత్రం బీఎస్ఎఫ్ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దేశాన్ని రక్షించే జవాన్లు ఆకలితో అలమటిస్తూ.. ఎలా పోరాడుతారని వారు ప్రశ్నించారు, క్రమశిక్షణల ఉల్లంఘనలకు పాల్పడుతున్న జవాన్ ను కీలకమైన లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఎలా విధుల్లో పెట్టారని ప్రశ్నిస్తున్నారు. మద్యం మత్తులో వుంటే డ్యూటీలోకి ఎలా అనుమతించారని నిలదీస్తున్నారు. మరికోందరు మాత్రం ఇలాంటి మెంటలోడి చేతికి తుపాకీ ఇచ్చి సరిహద్దులో ఎలా పెట్టారని ఎద్దేవా చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles