నోట్ల రద్దుకు రజనీకి సంబంధం ఏంటి? | Chidambaram briefs Rajini on demonetisation.

Congress senior leader met rajinikanth

Congress, P.Chidambaram, Rajinikanth, Congress Rajinikanth, Rajinikanth demonetization, Chidambaram Rajinikanth, Rajanikanth Chidambaram, Tamil Nadu politics, Ajith met Sasikala Natarajan, Former Union Minister Chidambaram

Congress Senior Leader P.Chidambaram met Actor Rajinikanth and explain about demonetization.

రజనీని కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేత

Posted: 12/28/2016 08:01 AM IST
Congress senior leader met rajinikanth

త‌మిళ రాజ‌కీయాల్లో మ‌రో చ‌ర్చ‌నీయాంశ‌మైన‌ భేటీ జ‌రిగింది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పి.చిదంబ‌రం త‌మిళ‌ సూప‌ర్ సార్ట్ ర‌జనీకాంత్‌ను ఆయ‌న ఇంటికి వెళ్లి మరీ కలిసొచ్చారు. ఇంటికి వ‌చ్చిన మాజీమంత్రిని ర‌జ‌నీకాంత్ సాద‌రంగా ఆహ్వానించారు. అయితే రెండు రోజుల క్రితమే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితులు, పెద్ద నోట్ల ర‌ద్దు త‌దిత‌ర అంశాల‌పై వీరిరువురూ చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. కాగా పెద్ద నోట్ల రద్దు నిర్ణ‌యానికి ర‌జ‌నీ గ‌తంలో ట్విట్ట‌ర్ ద్వారా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించగా, మ‌రోవైపు నోట్ల ర‌ద్దును మాజీ ఆర్థిక మంత్రి అయిన చిదంబ‌రం తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వీరి క‌ల‌యిక ప్రాధాన్యం సంత‌రించుకుంది. రజనీని వాళ్లు మాత్రమే వాడుకోవాలి

ఇక జయలలిత మరణం తర్వాత రజనీ రాజకీయ ఆరంగ్రేటం గురించి సోదరుడు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదే కరెక్ట్ సమయమని తలైవాకు సూచించాడు కూడా. కానీ, రజనీ మాత్రం అవేం పట్టన్నట్లు ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే వీరి భేటీ జరగటంతో ఏం జరగబోతుందోనని అనుమానాలు రేకెత్తున్నాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రజలకు రజనీకాంత్‌ పట్ల ప్రత్యేక గౌరవం, అభిమానాలున్నాయి. దీంతో అనేక పార్టీలకు చెందిన ప్రముఖులు తరచూ రజనీకాంత్‌ను కలుసుకుని చర్చలు జరుపుతుంటారు. ఈ నేపథ్యంలోనే చిదంబరం.. రజనీని కలిశారని సన్నిహితులు చెబుతున్నారు.

మొత్తానికి వారిద్ద‌రూ క‌లిసి ఏం మాట్లాడుకుని ఉంటార‌న్న దానిపై త‌మిళ‌నాట జోరుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. మరోవైపు జయలలితను తల్లితో సమానంగా చూసుకునే నటుడు అజిత్-శశికళ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సరిగ్గా శశికళకు పగ్గాలు అప్పజెప్పడానికి ముందే ఈ పరిణామాలు చోటుచేసుకోవటంతో అప్పుడే విశ్లేషణ ప్రారంభమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Congress  P.Chidambaram  

Other Articles