కాన్పూర్ ఓ ‘యాక్సిడెంట్’ స్పాట్ ! | one more train derailed at Kanpur.

Ajmer sealdah express derail near kanpur

Ajmer-Sealdah Express, train derails, Kanpur Train Derails, 2 killed Ajmer-Sealdah Train, train accident, Train Accidents in India, Patna-Indore passenger accident, Train accidents 2016, Uttar Pradesh train derails

2 killed, many injured as Ajmer-Sealdah Express train derails in Kanpur.

మరో రైలు ప్రమాదం.. ఏం జరిగింది

Posted: 12/28/2016 08:44 AM IST
Ajmer sealdah express derail near kanpur

ఉత్తరప్రదేశ్ లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. కాన్పూర్ స‌మీపంలో ఈ తెల్ల‌వారుజామున‌ సెల్డా-అజ్మీర్ ఎక్స్‌ప్ర‌మాదానికి గురైంది. మొత్తం రైలులోని 14 బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. ఇంతవరకు ఎవరూ చనిపోయినట్లు అధికారులు తెలియజేయలేదు. అయితే ఇద్దరు చనిపోయినట్లు, ప‌లువురు ప్ర‌యాణికులు మాత్రం తీవ్రంగా గాయ‌ప‌డినట్లు తెలుస్తోంది. క్ష‌త‌గాత్రుల హాహాకారాల‌తో ఆ ప్రాంతం మార్మోగుతోంది.

స‌మాచారం అందుకున్న ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నాయి. బోగీల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించి బ‌య‌ట‌కు తీసుకొస్తున్నాయి. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీపంలోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నారు. ఉదయం 6 గంటల సమయంలో కాన్పూర్ కి 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కాలువను దాటుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఎవరూ చనిపోలేదు. ఒరిగిపోయిన బోగీల నుంచి ప్రయాణికులను రక్షించేందుకు యత్నిస్తున్నాం.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై కారణాలను అన్వేషిస్తున్నాం అని అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, ప్ర‌మాదంతో ప్ర‌యాణికులు ఒక్కసారిగా భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. గత నెలలో కాన్పూర్ లోనే జరిగిన ఇండోర్-పాట్నా ప్యాసింజర్ రైలు ప్రమాదంలో 143 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajmer-Sealdah Express  train derails  Kanpur  

Other Articles