నోట్ల రద్దు తరువాత కారు కొన్నారా..? ఐటీ నోటసు అందుకోండీ.. purchased a car after demonetisation..? wait for IT notice

Purchased a car after demonetisation wait for it notice

Demonetisation, income tax department, car sales in india, IT notice, car dealers, house, binami assets

Cars dealers who have shown high bank deposits and high sales figures in November have been served notice by the income tax department.

నోట్ల రద్దు తరువాత కారు కొన్నారా..? ఐటీ నోటసు అందుకోండీ..

Posted: 12/27/2016 07:09 PM IST
Purchased a car after demonetisation wait for it notice

పెద్దనోట్ల రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించిన తేదీ గుర్తుందా..? నవంబర్ 8. సరిగ్గా ఆ రోజు తరువాత మీరు మీ వద్దనున్న పెద్ద నోట్లతో కారు గట్రా కోన్నారా..? అయితే మీరు వారి దృష్టిలో పడినట్లే. ఎవరంటారా.. అదాయపన్ను శాఖ అధికారులు. నవంబర్ 8వ తేదీ తర్వాత కార్లు కొనుగోలు చేసిన వారికీ నోటీసులు వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. అదేంటి ఏదో రెండున్నర లక్షల పెట్టి కారు కోన్నాం అదీ తప్పే అంటే.. తప్పేనట.

కొట్ల రూపాయలు ఖరీదు చేసే టాప్ ఎండ్ క్లాస్ కార్ల నుంచి సామాన్యుల కోసం వచ్చిన బుడ్డి కార్ల వరకు ఏ కారు కొన్నా.. అదాయపన్ను శాఖ అధికారులు పంపే శ్రీముఖాలను అందుకోక తప్పవట. నోట్ల రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా పలు చోట్ల విస్తృత సోదాలు నిర్వహించిన ఐటీ శాఖ.. పెద్ద సంఖ్యలో కార్ల డీలర్ల నుంచి వచ్చిన నోట్లను పరిశీలించిన తరువాత ఈ మేరకు నిర్ణయం తీసుకుందట. ఇప్పటికే పలువురు కారు డీలర్లకు నోటీసులను కూడా అందించింది అదాయపన్నుశాఖ.

నవంబర్ 8 తర్వాత దేశంలో ఎన్నికార్లు విక్రయించారనే వివరాల గురించి తెలుసుకునే పనిలో ఐటీ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న కార్ల డీలర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.  నవంబర్ 8 తర్వాత కార్లు కొనుగోలు చేసే వారు ఆయా తేదీలను మార్చుకుంటారనే అనుమానాన్ని కూడా సంబంధిత అధికారులు వ్యక్తం చేశారు. ఎంట్రీ పుస్తకాల్లో పాత తేదీలను కూడా తనిఖీ చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న కార్ల డీలర్లు..అమ్మకాలకు సంబంధించిన వివరాలను ఐటీ శాఖ అధికారులకు అందజేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles