ఇండియన్ ఆర్మీపై ప్రముఖ నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు Om Puri Condemns Pakistan Artist Ban, Ends Up Insulting Uri martyrs

We didn t force the soldiers to join the army om puri insults uri martyrs

Om Puri, Uri martyrs, controversial statements, pakistan artists, Indian Army, bharat motion picture producer association, salman khan, Anupam Kher, Ashoke Pandit, BuzzPatrol, Madhur Bhandarkar, Maharashtra Navnirman Sena, MNS, Randeep Hooda,

Veteran actor Om Puri has come out in support of Pakistani actors, saying art and politics should be kept separate and banning the artistes will not change the situation.

ఇండియన్ ఆర్మీపై ప్రముఖ నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 10/04/2016 01:47 PM IST
We didn t force the soldiers to join the army om puri insults uri martyrs

ఇండియన్ ఆర్మీ గురించి ప్రముఖ నటుడు ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల దొంగ దోబ్బతో 19 మంది భారతీయ జవాన్లను అమరవీరులుగా మార్చిన ఉడీ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ నటులపై భారత్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(ఐఎమ్పీపీఏ) నిషేధం విధించడంపై ఆయన పెదవి విరిచారు. అమరవీరులైన భారత సైన్యంపై ఆయన అవమానకర వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడిగా దేశంలో స్వేఛ్చా వాయువును పీలుస్తున్న ఆయన.. చలికి, ఎండకు, వానకు ఎదురీదుతూ భారత మాతను, దేశ ప్రజలను రక్షిస్తున్న సైనికులను కించపర్చేలా వ్యాఖ్యలు చేయడం అయన అవివేకాన్ని బయటపెడుతుంది. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదం రాజుకున్నాయి.
 
ఓం పురి చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి..
* ఆర్మీలో వారిని ఎవరు చేరమన్నారు? (ఎవరు చెబితే పురి నటనా రంగాన్ని ఎంచుకున్నారు)
* ఎవరు వారిని ఆయుధాలు పట్టుకోమన్నారు (ఎవరు చెప్పారని ముఖానికి రంగులేసుకున్నారు)
* మేమేమి జవాన్లను ఆర్మీలో చేరమని చెప్పలేదుగా (ప్రజలు ఆయనను నటుడు కావాలని కోరుకోలేదుగా..)
* 15 నుంచి 20 మానవ బాంబులు తయారుచేయండి (చెప్పడం చాలా ఈజీ. మీరు మొదటి మానవబాంబు అవుతారా.?)
* పాకిస్తాన్ను పేల్చడానికి వాటిని వాడండి  (పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై మాత్రమే భారత్ యుద్దం)
* ఇజ్రాయిల్, పాలస్తీనా మాదిరి భారత్-పాకిస్తాన్లు కూడా యుగయుగాలుగా శత్రువులుగా మారలనుకుంటున్నారా?  (కాల్పులు ఉల్లంఘనకు పాల్పడుతున్నదెవరో తెలిసి కూడా ప్రశ్నించే మూర్ఖత్వం వీడండి)
* కోట్లమంది ముస్లింలకు భారత్ పుట్టినిల్లు (మన దేశం ముస్లింలు కూడా పాకిస్తాన్ ఉద్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు)
* భారత్-పాకిస్తాన్ విభజన అంటే కేవలం దేశాల విభజనే మాత్రమే కాదు, కుటుంబాలు విడిపోవడం కూడా. ( సంయమనం పాటించిన మనకు కాదు.. ఉద్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ తెలియాలి)
* భారతీయుల కుటుంబసభ్యులు అక్కడ ఉన్నారు. అక్కడ వారు ఇక్కడా ఉన్నారు. (అ విషయాలు తెలుసు కాబట్టే భారత్ సంయమనంతో వ్యవహరిస్తుంది)
* సరిహద్దు కుటుంబాలు ఎలా యుద్ధం చేసుకుంటారు? ( యుద్దం కుటుంబాల మధ్య కాదు.. ఉగ్రవాదంపైన మాత్రమే కనీసం దేశాల మధ్య కూడా కాదు.)
* పాకిస్తాన్ నటులను, సెలబ్రిటీలపై నిజంగా నిషేధం విధించాలంటే, భారత ప్రభుత్వాన్ని వారి వీసాలు రద్దు చేయండి. ( నిషేదాన్ని మీలాంటి నటులు జీర్ణంచుకోలేకపోతున్నారు..)
 
ఇది యుద్దం కాదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. యుద్దం అనేది రెండు దేశాల మధ్య వుంటుంది. పాకిస్థాన్ తమ దేశంలో వేళ్లూనుకుంటున్న ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో విఫలమైంది కాబట్టే మనం దానికి సమాధానం ఇస్తున్నాం. ఎందుకు ఉగ్రవాదాన్ని అరికట్టలేకపోతున్నారని అగుడుతున్నాం. ఉగ్రవాదం అనే పాముకు పాలు పోసి పెంచడం మాకే కాదు మీకు కూడా నష్టమని చెప్పినా పెడచెవిన పెడుతుంది. ఆర్మీ పాఠశాలపై దాడి చేసి జవాన్ల పిల్లలను రక్తాన్ని కల్లజూసిన ఘటనను కూడా మర్చిపోయింది.

ఉద్రవాదులను అస్త్రాలుగా మలుచుకుని మనపైకి ఉసిగోల్పుతున్న తీరును మానుకోమ్మని మాత్రమే భారత్ చెప్పింది. భారత ఆర్మీ పవర్ గురించి తెలియక కాదు..తెలిసే ఇలాంటి చర్యలకు పాక్ పాల్పడుతుంది.   విసురుతూ దొంగదెబ్బలు తీస్తూగతంలోనూ ముందు కూడా పాకిస్తాన్ నటులకు ఆయన మద్దతిచ్చారు. వాలిడ్ వీసాతో వారు ఇక్కడ పనిచేస్తున్నారని, వారిని నిషేధించడం సరికాదన్నారు. పాకిస్తానీ నటులపై నిషేధం, పరిస్థితుల్లో మార్పు తేవన్నారు. దీంతో ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Om Puri  Uri martyrs  controversial statements  pakistan artists  Indian Army  

Other Articles