సిద్దూ భార్య బీజేపీలోనే | Sidhu's wife Navjot Kaur continue in BJP

Sidhu s wife navjot kaur continue in bjp

Sidhu's wife, Sidhu's wife in BJP, Navjot Kaur wants to continue in BJP, Sidhu's wife Navjot Kaur continue in BJP

Sidhu's wife Navjot Kaur wants to continue in BJP.

సిద్దూకి సాలిడ్ షాకిచ్చిన భార్య

Posted: 07/19/2016 03:03 PM IST
Sidhu s wife navjot kaur continue in bjp

రాజ్యసభ సభ్యత్వంతోపాటు బీజేపీకి సోమవారం రాజీనామా చేశారు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. అయితే ఆయన పార్టీ వీడినా ఆయన భార్య మాత్రం బీజేపీలోనే కొనసాగుతారంట. ఆమె కూడా రాజీనామా చేస్తున్నారన్న ఊహగానాల నడుమ కాసేపటి క్రితం నవజ్యోత్ కౌర్ సిద్ధూ ఈ ప్రకటనల చేశారు. అయితే ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేశానని, పార్టీని మాత్రం వీడే పరిస్థితి లేదని ఆమె స్పష్టం చేశారు.

ఎంపీగా తన భర్త రాజీనామాతో తనకు పదవిలో కొనసాగే హక్కు లేదని భావించే తానూ రిజైన్ చేశానని చెప్పిన ఆమె, బీజేపీని మాత్రం వీడబోనని చెప్పారు. నా భర్త(సిద్దూ) బీజేపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారని చెప్పిన ఆమె, పంజాబ్ కు సేవ చేయాలని భావిస్తున్నారని, ప్రజాసేవలో ఆయనకు తనవంతు సహకారాన్ని అందిస్తానని వెల్లడించారు. కాగా, సిద్ధూ ఆప్ లో చేరి, పంజాబ్ కు ఆ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే గతంలో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ ను బీజేపీ తరపున ఏకిపడేసిన నేతల్లో సిద్దూ కూడా ఉన్నాడు. దీంతో ఆ వీడియోలను బయటికి తీసి సిద్దూను ఇరకాటం పెట్టాలని బీజేపీ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Navjot Singh Sidhu  AAP  Sidhu's wife  Navjot Kaur  BJP  

Other Articles