Youth dies after bike collides with Union Minister Ram Kripal Yadav's escort jeep

Car from union minister convoy rams into bike kills biker

Ram Kripal Yadav, PATNA, Uttar Pradesh, accident, Cavalcade, Rahul Kumar, motorbike collide

A youth was killed, and six security personnel injured, when his motorbike collided head on with a jeep in the cavalcade escorting Union minister Ram Kripal Yadav in Patna district

కేంద్ర మంత్రి కారు ఢీకొని యువకుడు మృతి

Posted: 07/10/2016 01:12 PM IST
Car from union minister convoy rams into bike kills biker

కేంద్ర మంత్రికి చెందిన కారు ఓ పద్దెనిమిదేళ్ల యువకుడి ప్రాణాలు బలితీసుకుంది. కేంద్రమంత్రికి చెందిన కారు ఢీకొని పద్దెనిమిదేళ్ల యువకుడు తన ప్రాణాలు కోల్పోయాడు. బీహార్ రాష్ట్రం రాజధానిలోని పాట్నా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం కేంద్రమంత్రి రామ్ కృపాల్ యాదవ్ వెళుతుండగా ఆయనకు రక్షణగా వస్తున్న కాన్వాయ్ లో ఓ కారు సరిగ్గా డెహ్రాడూన్ అనే గ్రామం వద్ద రాహుల్ కుమార్ అనే యువకుడు బైక్ పై వస్తుండగా ఢీకొట్టింది.

ఈ కారులో ఉన్న మంత్రి ఆరుగురి సిబ్బంది కూడా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా ధ్వంసం అయింది. ఢీకొట్టిన కారు పూర్తిగా పల్టీలు కొట్టింది. ఈ సందర్భంగా మంత్రి రామ్ కృపాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబంపట్ల సంతాపం వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందని అన్నారు. భాదిత కుటుంబాన్ని అన్ని విధాలా అదుకుంటామని హామి ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Kripal Yadav  PATNA  Uttar Pradesh  accident  Cavalcade  Rahul Kumar  motorbike collide  

Other Articles