హస్తం చెదలు దులుపుకుంటుంది | congress re launch National Herald and two more papers

Congress re launch national herald and two more papers

Congress Re launch National Herald, National Herald Back Again, Congress Hindi daily Navjivan and Urdu Paper Qaumi Awaz

Congress Re launch National Herald and two more daily news papers.

హస్తం చెదలు దులుపుకుంటుంది

Posted: 07/11/2016 09:40 AM IST
Congress re launch national herald and two more papers

చరిత్రకు పట్టిన చెదలు దులిపేందుకు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ సిద్థమైపోతుంది. ప్రస్తుతం అధికారంకు ఆమడ దూరంలో ఉన్న కాంగ్రెస్ సరైన మీడియా అండ లేకపోవటంతో సొంత పుత్రికను మళ్లీ తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం మూతపడిపోయిన ‘నేషనల్ హెరల్డ్’ దినపత్రికను తిరిగి ప్రారంభించేందకు రంగం సిద్ధం చేసింది.

ఈ పత్రికతోపాటే ఖువామీ ఆజాద్(ఉర్దూ), నవజీవన్(హిందీ) దినపత్రికలను కూడా తిరిగి ప్రారంభించబోతుంది. కాంగ్రెస్ పార్టీ కోశాధికారి, పేపర్లను పబ్లిష్ చేసే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్) సీఎండీ మోతీలాల్ వోరా ఈ విషయమై ప్రకటన చేశారు. జనవరిలోనే జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఆయా పత్రికలకు కూడా ఎడిటర్ల పేర్లు కూడా దాదాపు ఖరారైనట్టు సమాచారం. అయితే దినపత్రికలా కాకుండా ముందుగా ఆన్ లైన్ ఎడిషన్ ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఈ రెండు మూడు రోజుల్లో ఓ అధికారిక ప్రకటన చేయనున్నారంట.

ఇక 1938లో లక్నోలో జవహర్‌లాల్ నెహ్రూ దీనిని ప్రారంభించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ పాలకులు దీనిని నిషేధించారు. ఆ తర్వాత మరోమారు 1940, 70లలో మూతపడింది. అనంతరం తెరుచుకున్నా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడింది. చివరికి పూర్తిగా సంక్షోభంలో చిక్కుకోవడంతో 2008లో మూతపడింది. ఆ సమయంలో నేషనల్ హెరాల్డ్ ఆస్తుల విలువ రూ.2వేల కోట్లు. కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చలేమని ఇందుకు కంపెనీకి చెందిన 9 కోట్ల పై చిలుకు షేర్లను వైఐఎల్‌కు ఇచ్చేందుకు ఏజేఎల్ సర్వసభ్యసమావేశం తీర్మానించింది. దీంతో రూ.50 లక్షలకే దాదాపు రూ. 2వేల కోట్ల విలువైన ఆస్తులు నలుగురైదుగురి నియంత్రణలోకి వెళ్లాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సోనియా, రాహుల్ తోసహా ఆరుగిరిపై ఢిల్లీ కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  Qaumi Awaz  Navjivan  National Herald  

Other Articles