Father of bride in Kota district gives neem plant to groom as dowry

Bride s father gives neem plant to groom as dowry

Dhakarkheri, Kota district, talk of the town, marriage occasion, neem plant, bride's father, Shakuntla Kabra, government schemes, social malice, society, harassment, dowry, Laxman, Ladpur village, Bhilwara district

Dhakarkheri, a nondescript village in Kota district, has become a talk of the town. A marriage solemnized here has taken everyone by surprise.

కట్నం కింద వేప చెట్టు ఇచ్చి కన్యాధానం..

Posted: 07/10/2016 12:59 PM IST
Bride s father gives neem plant to groom as dowry

ప్రేమ వివాహం చేసుకున్న యువకులు కూడా వరకట్నం లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇష్టపడని రోజులివి. ఇక తమనే నమ్మకుని వచ్చిన వదువు కన్నా కట్నం మీదే అధిక మోజు పెట్టుకుని.. అదనపు కట్నం కోసం వారిని అనుక్షణం నరకాన్ని చూపుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుకుపోతున్న.. ఈ రోజుల్లో రాజస్థాన్ కోటా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కట్నం కింద ఓ కుటుంబం కట్నంగా వేపచెట్టును తీసుకుని జిల్లా మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఢాకర్ కేరి గ్రామానికి చెందిన శకుంతల కబ్రా తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది.

ప్రభుత్వ పనులకు సంబంధించిన అప్లికేషన్లు నింపడానికి గ్రామస్థులకు సాయపడుతుంటుంది. భిల్వారా జిల్లాలోని లడ్ పూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తితో కబ్రాకు ఆమె తండ్రి వివాహం చేయాలని నిశ్చయించారు. ఇందుకోసం లక్ష్మణ్ కుటుంబసభ్యులను సంప్రదించిన ఆయన తన కూతురు, ఒక వేప మొక్కను తప్ప కట్నం ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేదని వారితో చెప్పాడు. వరుడి కుటుంబసభ్యులు ఇందుకు అంగీకరించారు. లడ్ పూర్ నుంచి ఓ చిన్న ట్రక్కులో దాదాపు 70 మంది కబ్రా, లక్ష్మణ్ వివాహానికి ఢాకర్ కేరికి తరలివచ్చారు.

వారందరి ముందు ఒక వేపమొక్కను తీసుకువచ్చి లక్ష్మణ్ కు కబ్రా తండ్రి అందించాడు. కొద్ది నిమిషాల్లోనే ఈ విషయం జిల్లా మొత్తం వ్యాపించింది. కట్నం లేకుండా వేపమొక్క తీసుకుని వివాహం చేసుకున్నారంటా.. అంటూ అక్కడి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరకట్నం ఇవ్వకుండా వివాహం చేసుకోవడంపై వధువు కబ్రా మాట్లాడుతూ.. వేప మొక్కను తన వివాహానికి ఆమె తండ్రి కట్నంగా ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. కట్నం కోసం మహిళలను వేధిస్తున్న ఈ రోజుల్లో తన పెళ్లి సమాజానికి ఆదర్శం అవుతుందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : neem plant  kota district  dowry  bride  groom Rajasthan  

Other Articles