పైసా ఖర్చులేని కూలర్ ఇదే.. | Bangladesh's cooler that runs without electricity could be the answer to Indias heat

Bangladesh s cooler that runs without electricity could be the answer to indias heat

Cooler, Banglore, heat, Eco cooler, India, electricity, ఎకో కూలర్, బెంగళూరు

Suffering from the hottest summer in recent times, India could consider looking at a cooling innovation designed and deployed in neighbouring Bangladesh. The best thing about this cooler? It needs no electricity. Like in India, rural homes in Bangladesh too are often made of corrugated tin, which make the heat even more oppressive indoors.

ITEMVIDEOS: పైసా ఖర్చులేని కూలర్ ఇదే..

Posted: 05/12/2016 12:45 PM IST
Bangladesh s cooler that runs without electricity could be the answer to indias heat

ఎండాకాలంలో ఫ్రీగా కూలర్ వస్తే.. అది కూడా పైసా ఖర్చులేకుండా నడిస్తే.. ఆ కూలర్ గాలితో ప్రశాంతంగా సేద తీరితే.. ఏదో సినిమా అనుకుంటున్నారా..? నిజమే మండువేసవిలో ఏమాత్రం ఖర్చు లేకుండా కూలర్ ను తయారుచేసి.. దాన్ని ఎంతో విజయవంతంగా ప్రయోగిస్తున్నారు గ్రామీణ్ ఇంటెల్ సోషల్ బిజినెస్ లిమిటెడ్. ‘ఎకో కూలర్’… ‘గే ఢాకా’, గ్రామీణ్ ఇంటెల్ సోషల్ బిజినెస్ లిమిటెట్’ సంస్థలు అభివృద్ధి చేసిన ఈ ఎకో కూలర్, పైసా ఖర్చు లేకుండా, కరెంట్‌తో అవసరం లేకుండా పని చేస్తుంది.

ఇందుకు కావాల్సింది ఇంటి కిటికీ సైజుండే కార్డ్‌బోర్డు ప్లాస్టిక్ సీసాలు ఉంటే చాలు చల్లచల్లని కూలర్ రెడీ! అయితే దీని పని తీరు తెలుసుకోవాలంటే మీరు చిన్న ప్రయోగం చేయాల్సి ఉంటుంది. మీ చేతిని నోటికి కొంత దూరంలో నోరు తెరిచి గట్టిగా గాలి ఊదండి.. వెచ్చటి గాలి మీ చేతులను తాకుతుంది కదా..? సరే ఇప్పుడు పెదవులను గుండ్రంగా చుట్టి ఇంకోసారి ఊదండి.. తేడా తెలిసిందా.. గాలి కొంచెం చల్లగా మారడం గమనించారా.. ఎకో కూలర్ కూడా పనిచేసేది ఇలాగే. ప్లాస్టిక్ బాటిళ్లను సగానికి కోసి రంధ్రాలు చేసిన కార్డ్‌బోర్డుకు బిగిస్తే చాలు. ఇంటి లోపలకి వచ్చే గాలి ఉష్ణోగ్రత దాదాపు 5 డిగ్రీల వరకు తగ్గిపోతుంది. చిన్న మార్గాల గుండా ప్రయాణించేందుకు గాలి పీడనానికి లోనవుతుంది. ఈ క్రమంలో గాలి ఉష్ణోగ్రత కూడా తగ్గి చల్లబడుతుంది. భలే ఐడియా కదూ..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cooler  Banglore  heat  Eco cooler  India  electricity  ఎకో కూలర్  బెంగళూరు  

Other Articles