తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల | Telangana SSC results out now

Telangana ssc results out now

Hyderabad, SSc, Results, Telangana, Tenth Results, పదో తరగతి ఫలితాలు, పది ఫలితాలు, ఎస్ఎస్సి

Telangana Deputy CM Kadium Srihari release SSC Resluts now. Warangal Dist got fisrt place in passing percentage. Hyderabad got last place.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల

Posted: 05/11/2016 12:29 PM IST
Telangana ssc results out now

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. హైద‌రాబాద్‌లో తెలంగాణ విద్యాశాఖ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఫ‌లితాల్లో ఉత్తీర్ణ‌త శాతం 85.63గా ఉంది. బాలుర ఉత్తీర్ణతా శాతం 84.70గా ఉంటే, బాలిక‌ల ఉత్తీర్ణతా శాతం 86.57గా ఉంది. ఫ‌లితాల్లో 95.13 శాతం ఉత్తీర్ణత‌తో వరంగ‌ల్ జిల్లా మొద‌టి స్థానంలో నిలిస్తే, హైద‌రాబాద్ 76.23శాతం ఉత్తీర్ణత‌తో చివ‌రి స్థానంలో నిలిచింది. ప‌ది స్కూళ్లలో 0 శాతం ఉత్తీర్ణత న‌మోద‌యింది. పరీక్షలు నిర్వహించిన నెల‌రోజుల్లోనే ఫ‌లితాలు విడుద‌ల చేశారు. జూన్ 15నుంచి అడ్వాన్స్డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు. ఈనెల 26లోగా అడ్వాన్స్డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల కోసం ఫీజు స్వీకరించనున్నారు.

మరోవైపు ఫెయిల్ అయిన విద్యార్థులకు మే లేదా జూన్ నెలల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పదో తరగతి ఫలితాల విడుదల తరువాత పాలీసెట్ కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. రిజల్ట్స్ కోసం కింది వెబ్ సైట్లను చూడవచ్చు.

www.bsetelangana.org

http://results.cgg.gov.in

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles