Part of funding for 9/11 came from India, says ex-top cop Neeraj Kumar

Stop chasing me dawood ibrahim told former top cop neeraj kumar

Neeraj Kumar, Dawood Ibrahim, underworld, Indain most wanted, "9/11 attacks, us 9/11 attacks, terroist attacks, us terror attack, india, india 9/11 attack, neeraj kumar, neeraj kumar book, neeraj kumar 9/11 attack

India's most-wanted terrorist Dawood Ibrahim had called senior IPS officer and former Delhi Police Commissioner Neeraj Kumar weeks before his retirement and said 'stop chasing me'.

నన్ను వేంటాడటం అపండీ.. 9/11 దాడులకు భారత్ నుంచి నిధులు..

Posted: 11/17/2015 09:30 PM IST
Stop chasing me dawood ibrahim told former top cop neeraj kumar

తన రిటైర్‌మెంట్‌కు ముందు ఓ సీనియర్ ఐపీఎస్‌ అధికారికి అండర్ వరల్డ్ డాన్‌ దావూద్ ఇబ్రహీం నుంచి ఊహించని కాల్‌ వచ్చింది. ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా మరికొన్ని రోజుల్లో పదవీ విరమణ చేస్తారనగా.. నీరజ్‌కుమార్‌ ఓరోజు దావూద్‌ నుంచి ఫోన్‌ కాల్‌ అందుకున్నారు. 'క్యా సాహెబ్‌, ఆప్‌ రిటైర్‌ హోనే జారేహే హో. ఆబ్‌ తో పీచ్చా ఛోడ్‌ దో' (ఏంటీ సర్‌ ఇది. మరికొన్ని రోజుల్లో రిటైర్‌ అవ్వబోతున్నారు. ఇప్పటికైనా నన్ను వెంటాడటం మానుకోండి) అంటూ దావూద్ కోరాడు. 2013 జూన్‌ మొదటి వారంలో ఈ ఘటన జరిగింది.

'ఒక రోజు నా పర్సనల్ మొబైల్‌కు ఓ గుర్తుతెలియని నెంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. అది బహుశా దావూద్‌ వ్యక్తిగత నెంబర్‌ ఉంటుంది' అని నీరజ్‌కుమార్ ఈ ఫోన్‌కాల్‌ గురించి వివరించారు  'మై కన్వర్సెషన్స్‌ విత్ దావూద్ ఇబ్రహీం' పేరుతో ఆయన రాసిన తాజా పుస్తకంలో 'డయల్ డీ ఫర్‌ డాన్' అధ్యాయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన వృత్తిజీవితంలో నిర్వహించిన 11 టాప్ ఆపరేషన్స్ గురించి వివరిస్తూ నీరజ్‌కుమార్ ఈ పుస్తకం రాశారు. ఈ ఆపరేషన్లన్నీ అండర్ వరల్డ్‌, 1993 ముంబై వరుస పేలుళ్లు, దేశవ్యాప్తంగా నేరగ్యాంగుల చుట్టే తిరుగుతాయి. ఎన్నో ఆసక్తికర అంశాలున్న ఈ పుస్తకం త్వరలోనే పెంగ్విన్ బుక్స్ విడుదల చేయనుంది.

ఉగ్రవాదుల చర్యల్లో అత్యంత హేయమైనదిగా భావించే 9/11 దాడికి భారత్ నుంచి నిధులు వెళ్లాయని కూడా ఆయన తన పుస్తకంలో పేర్కోన్నారు.. పేలుడు పదార్థాల తయారీ, విమానాల హైజాక్ నుంచి ట్విన్  టవర్స్ కూల్చివేత వరకు పథకాన్ని పక్కాగా అమలుపర్చేందుకు ఉగ్రవాదులు ఖర్చు చేసిన డబ్బులో కొంత భారత్ నుంచి సమకూరిందన్నారు. కోల్కతాలోని అమెరికన్ సెంటర్ పై దాడి (జనవరి 2, 2002) కేసులో ఉరిశిక్ష పడిన దోషి, ప్రస్తుతం జైలులో ఉంటోన్న అఫ్తాబ్ అన్సారీ.. తన గ్యాంగ్తో కలిసి 2001లో ఖాదీమ్ వ్యాపార సంస్థల అధిపతి పార్థా ప్రతిమ్ రాయ్ బర్మన్ను కిడ్నాప్ చేశాడు. బాధితుడ్ని విడిచిపెట్టే క్రమంలో భారీగా సొమ్ము చేతులు మారింది. అప్పటికే దుబాయ్ నేర సామ్రాజ్యాధిపతులు, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల నాయకులతో సంబంధాలున్న అఫ్తాబ్.. బర్మన్ కిడ్నాప్ ద్వారా లభించిన సొమ్ములో కొంత భాగాన్ని షేక్ ఒమర్ కు పంపాడని ఆయన పుస్తకంలో రాశారు

ఇంతకీ షేక్ ఓమర్ ఎవరంటే.. 1999 కాందహార్ విమాన హైజాక్ ఉదంతంలో భారత్ విడిచిపెట్టిన ఉగ్రవాదుల్లో ఒకడు షేక్ ఒమర్. సొంత సంస్థ హర్కత్ ఉల్ ముజాహిద్దీన్ తోపాటు తాలిబన్లతో కలిసి కార్యకలాపాలు నిర్వహించేవాడు. ప్రస్తుతం పాక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతను మొహమ్మద్ అట్టాకు అత్యంత నమ్మకస్తుడు. ఈ అట్టాయే 9/11 దాడుల కీలక సూత్రధారి. ఒమర్‌ కు...  అన్సారీ నమ్మినబంటు కావడంతో అడిగిందే తడవుగా తన దగ్గరున్న డబ్బును పాక్ కు చేరవేశాడు . అలా ఆ సొమ్ము ట్విన్ టవర్స్ కూల్చివేతకు వినియోగించారు. దాడుల అనంతరం అట్టాను ఎఫ్ బీఐ అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా స్వయంగా అట్టాయే ఈ విషయాలు వెల్లడించాడని, ఆమేరకు ఎఫ్ బీఐ అధికారి జాన్ పిస్టోల్ తన రిపోర్టులో అట్టా వాగ్మూలాన్ని నమోదుచేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Neeraj Kumar  Dawood Ibrahim  underworld  Indain most wanted  

Other Articles