police dog squad stops at mohans nephew chintus house

Police dog squad ends their probe at chintoos house in anuradha murder case

Chittoor crime news, chittoor mayor, AP CM chandrababu, anuradha, mohan's nephew chintu, three suspects surrendered, chitoor one town police station, Chittoor mayor Anuradha, 144 section, Chittoor mayor Murder, Chittoor Attack, chitoor recky, factionism, rayalaseema factionist murder, Chittoor Mayor Katari Anuradha Brutally Killed, Chittoor Mayor Katari Anuradha Mudder, Kathari Mohan Condition Critical, Chittoor Mayor Katari Anuradha

police dog squad ends their probe at kathari mohan's nephew chintoos house in anuradha murder case

అనురాధ హత్యకేసులో.. చింటూ ప్రమేయంపై బలపడుతున్న అనుమానాలు

Posted: 11/17/2015 09:13 PM IST
Police dog squad ends their probe at chintoos house in anuradha murder case

మేయర్ కఠారి అనురాధ హత్య కేసులో వారి సమీప బంధువుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు భావిస్తున్నారు. కఠారి మోహన్ మేనల్లుడు చింటూ ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్నారు. పోలీసు జాగిలాలు కూడా అతడి ఇంటి వద్దకు వెళ్లి ఆగడంతో అనుమానాలకు బలపడుతున్నాయి. మోహన్, చింటూలకు మధ్య చాలాకాలంగా ఆధిపత్య, ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఎంటెక్ చదువుకున్న చింటూ నేరచరిత్ర కలిగివున్నాడు. 2004లో ఓ హత్య కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు. పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగి పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు.

పోలీసులు తన కేసు పట్టించుకోలేదని పలుమార్లు మీడియా ముందు చింటూ వాపోయినట్టు తెలిసింది. కాగా చింటూ నుంచి ప్రాణభయం ఉందన్న కారణంతో తనకు సెక్యురిటీ పెంచాలని ఎస్పీ కార్యాలయానికి అనురాధ ఇటీవల లేఖ రాసినట్టు తెలిసింది. ఈరోజు ఆమె ఎస్కార్ట్ సెలవులో ఉన్నట్టు సమాచారం. కార్పొరేషన్ కార్యాలయంలో సీసీ కెమెరాలు కూడా పని చేయడం లేదని తెలుస్తోంది. కాగా చింటూ లొంగిపోయాడని ప్రచారం జరుగుతోంది. చింటూ అరెస్ట్ ను పోలీసులు ధ్రువీకరించలేదు. మరోవైపు చింటూ ఇంటిపై మేయర్ మద్దతుదారులు దాడి చేశారు. మూడు వాహనాలను ధ్వంసం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chittoor mayor  Anuradha  Murder  kathari mohan  nephew  

Other Articles