Chandimal heroics helps Sri Lanka set India 176 for win

Team india lose 7 wickets at 67 runs

Captaincy, Cricket, Galle, India, India in Sri Lanka 2015, Murali Vijay, Sports, Sri Lanka, Virat Kohli, Ravichandran ashwin, amit mishra, Harbhajan Singh, cricket, srilanka tour, ind vs srl, India vs srilanka, ind vs sri 2015, srilanka, India, India Vs Sri Lanka Live live cricket, Live Cricket Score, Test Cricket Live, Virat Kohli, Ajinkya Rahane, Angelo Mathews, Kumar Sangakkara, Galle, cricket news

Dinesh Chandimal inspired a Sri Lankan fightback with an attacking unbeaten 162, his highest score, as the hosts set India a target of 176 on the third day on Friday to win the opening test at Galle.

సీన్ రివర్స్: ఓటమి అంచుల్లో భారత్.. కుప్పకూలిన టాప్, మిడిల్ ఆర్డర్

Posted: 08/15/2015 11:49 AM IST
Team india lose 7 wickets at 67 runs

శ్రీలంక జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.176  పరుగుల స్వల్పలక్ష్యంతో నాలుగు రోజు ఆట ప్రారంభించిన టీమిండియా వరుస వికెట్లను కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. టీమిండియా 23 /1 ఓవర్ నైట్ స్కోరు తో ఈరోజు ఆటను ప్రారంభించింది.  శుక్రవారం కేఎల్ రాహుల్ (5) ను తొలి వికెట్ రూపంలో కోల్పోయిన టీమిండియా . శనివారం నైట్ వాచ్ మన్ ఇషాంత్ శర్మ(10) వికెట్ ను ఆదిలోనే చేజార్చుకుంది.  ఇషాంత్ శర్మ వికెట్ కోల్పోయే సరికి టీమిండియా స్కోరు 30/2.

అయితే ఆ తరువాత టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. టీమిండియా 67 పరుగులకే ఏడు వికెట్లు నష్టపోయి ఒక్కసారిగా కష్టాల్లో పడింది. టీమిండియా ఆటగాళ్లలో శిఖర్ ధావన్(28), రోహిత్ శర్మ(4), విరాట్ కోహ్లీ(3), సాహా(2), హర్భజన్ సింగ్(1) లు పెవిలియన్ కు చేరి టీమిండియాను కష్టాల్లో నెట్టారు. ఇంకా విజయానికి 109 పరుగులు అవసరం.  ప్రస్తుతం అజింక్యా రహానే(17), అశ్విన్(3)లు క్రీజ్ లో ఉన్నారు. లంక బౌలర్లలో హెరాత్ కు ఐదు వికెట్లు లభించగా, కౌశల్ కు రెండు వికెట్లు లభించాయి. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 183 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 367 పరుగులకు ఆలౌట్ కాగా,  టీమిండియా తొలి ఇన్నింగ్స్ 375 ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో కష్టాల్లో పడింది.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ashwin  amit mishra  chanimal  srilanka  India  ind vs sri  india vs srilanka 2015  

Other Articles