TDP | Central govt | Modi | BJP, AP, Special status, Chandrababu naidu

Telugudesam party leaders didnt speak and even fight aganist the central govt for ap

TDP, Central govt, Modi, BJP, AP, Special status, Chandrababu naidu

Telugudesam party leaders didnt speak and even fight aganist the Central govt for ap. AP TDP Leeaders didnt fight for special status for ap.

టిడిపి బిజెపికి ఊడిగం చేస్తోంది.. కాదంటారా?

Posted: 07/22/2015 03:18 PM IST
Telugudesam party leaders didnt speak and even fight aganist the central govt for ap

తెలుగు వాళ్లు నిదానం.. నిజంగానే నెమ్మది.. ఎంతలా అంటే సమస్యల మీద మాట్లాడండి అంటే పార్లెమంట్ లో మాట్లాడరు. సరే తర్వాత చూద్దాం అంటూ అటకెక్కిస్తారు. కేంద్రం నుండి నిధులు సాధించండి బాబూ అంటే.. చాలా రాష్ట్రాలు ఉన్నాయి.. మనం తర్వాత చూసుకుందాంలే అంటారు.. అందులో నిర్లక్షం. సరే పక్క రాష్ట్రాలు నీళ్లు వదలడం లేదు.. అంటూ అందులోనూ నిర్లక్షం. మరి ఇంత నిర్లక్షం ఉంటే సమస్యల మీద విజయం మాత్రం ఎలా సాధ్యం. అయితే ఇంట గెలిచి రచ్చగెలవాలన్న చందాన.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీరాలు పలుకుతున్నారు. అయితే ఇంట సంగతి ఏమో కానీ రచ్చ గెలవడం మాత్రం మన వాళ్లకు రానిపని. అయితే విషయం ఏంటి అంటే తెలుగు రాష్ట్రాలు కేంద్రం నుండి నిధులు కానీ హామీలు కానీ పొందడంలో ఎన్నడూ మన వాళ్లు వెనకాలే ఉండిపోయారు.

Also Read:  ఏపికి ప్రత్యేక హోదా పక్కా అంటున్న కేంద్ర సహాయ మంత్రి

తెలుగు రాష్ట్రాల గురించి మొత్తం చర్చించడం ఎందుకు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ గురించి మాత్రం మాట్లాడదాం. అటు ఏపిలో, తెలంగాణలో కూడా తెలుగు దేశం పార్టీకి గట్టి ఓటు బ్యాంక్ ఉంది. అయినా కానీ తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం కేంద్రం ముందు మాత్రం మీనమేషాలు లెక్కిస్తు టైం పాస్ చేస్తున్నారు. కేంద్రం నుండి ఏపికి నిధులు, ప్రత్యేక హోదా మీద మాట్లాడండి బాబూ అంటే.. మాట్లాడరు. అసలు నోట్లో నాలుక ఉందా అనే అనుమానం వచ్చేంతగా ఖామోష్ గా కూర్చోవడం మన వాళ్ల స్పెషలాటి. సరే తొండికో మొండికో కనీసం ఒక్క ఎంపీ అయినా మాట్లాడతారా అంటే అదీ లేదాయె.. ఏదో మాట సాయానికి కూడా మాట్లాడరు. అయితే మన వాళ్లు కొత్తగా అచ్చులు... వాటికి కొత్త అర్థాలు నేర్చుకుంటున్నారు. బహుశా మన వాళ్లు

అంటే అధికారం..
అంటే ఆమడ దూరం..
అంటే ఇప్పుడొద్దు..
అంటే ఈ సారికి వద్దు.. అన్నట్లు కొత్తగా నేర్చుకుంటున్నారు.

Also Read:  ఏపికి ప్రత్యేక హోదా అర్హతే లేదు.. కుండబద్దలుకొట్టిన వెంకయ్య
Also Read:  ప్రత్యేకహోదా రానప్పుడు కేంద్రంలో మంత్రులెందుకు...?

ఇక తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహారం అయితే విచిత్రం ఉంది. ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లుంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. తెలుగుదేశం నాయకులు సాహసించి ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదు. కేంద్రం మీద ఎలాంటి వత్తిడి చెయ్యలేని స్థితిలో ఉన్నారు. ఎవరి మీద వత్తిడి చెయ్యాలో.. ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. టిడిపి , బిజెపి పార్టీలు ఎన్నికల్లో కలిసి ప్రచారం చేశాయి. కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీయే పక్షంలో ఓ మిత్రపక్షంగా ఉంది. మామూలుగా అయితే మిత్రపక్షాలు కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి తీసుకువచ్చి తమకు కావాల్సిన నిధులను రాబట్టుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్రం మీద వత్తిడి తీసుకురావడం మాటటుంచి.. కనీసం నోరు కూడా మెదపడం లేదు.

Also Read:  నవ్యాంధ్రకు అమిత్ షా అభయం

అదే తమిళనాడు నాయకులు అయితే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది. తమిళ నాయకులు మన వాళ్లలాగా ఊరికే కూర్చోరు. ఒకటికి పది సార్లు ఢిల్లీలో అందరిని కలుస్తారు. పార్టీలు, పక్షాలు పక్కనబెట్టి కేంద్రం మీద దండెత్తుతారు. కేంద్రం నుండి తమకు ఏం కావాలో ముక్కు పిండి మరీ సాధించుకుంటారు. అయినా పక్క రాష్ట్రం నేతలు అంత చేస్తున్నా కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం మాట మాట్లాడటం లేదు. ఎందుకు అంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఏపికి ప్రత్యేక హోదా కావాలి. అలాగే రాజధాని నిర్మాణానికి, లోటును పూడ్చడానికి చాలా నిధులు కూడా కావాలి. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు గప్ చుప్ గా కూర్చుంటున్నారు. అదేంటి అలా ఎందుకు అనుకుంటున్నారా..? ఒకవేళ కేంద్రం మీద ఎక్కువగా వత్తిడి చేస్తే ఎలాంటి సానుకూల నిర్ణయాలు రావనో లేదంటే.. ప్రత్యేక హోదా రాదనో భయపడుతున్నట్లున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వంలో బాగస్వామిగా ఉంటూ కూడా ఏమీ చెయ్యలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. చాలా మంది తెలుగుదేశం పార్టీ కేంద్రానికి ఊడిగం చేస్తోందని మండిపడుతున్నారు.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Central govt  Modi  BJP  AP  Special status  Chandrababu naidu  

Other Articles