Pigs| China | Tourism

China tourism official planed to entertaining by flying pigs

Pigs, China, Tourism, Shiyan lake, Bridge,

A tourism official in central China came up with a novel way of entertaining visitors to Shiyan Lake, by creating a show featuring "flying" pigs. The animals were herded onto a bridge above the lake in Changsha. Identified by red numbers painted on their sides, the pigs were then driven off the bridge by a man holding a stick, and splashed into the water below.

మీకు తెలుసా.. పందులు ఎగరగలవు

Posted: 05/05/2015 04:14 PM IST
China tourism official planed to entertaining by flying pigs

అవును మీరు చదివింది అక్షరాల నిజం. మనం అసహ్యించుకునే పందులు ఎగరగలవు, ఈదగలవు కూడా. అయితే పందులు ఎగరడం, ఈదడం గురించి చైనాలో ప్రస్తుతం ఓ వివాదం రేగింది. ఏంటీ అనుకుంటున్నారా.. చెబుతున్నా.. చైనాలో పర్యాటకులను ఆకట్టుకోవడానికి అక్కడి టూరిజం డిపార్ట్ మెంట్ కొన్ని పందులను స్పెషల్ అట్రాక్షన్ గా మర్చింది. కొన్ని పందులను ఓ బ్రిడ్జి మీద నుండి ఎగరవేసింది. అలా అలా గాలిలో తేలుకుంటూ టప్ మని నీటిలొకి దూకిన పందులు ఈదుకుంటూ ఒడ్డును చేరుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఫోటోలు నెట్ లో విమర్శలకు తావిస్తున్నాయి. అసలు పందులను ఎలా హింసిస్తార్రా బాబూ అంటూ కొంత మంది అంటుంటే మీరూ పందిలాగా పుడితే తెలుస్తుందని మని కొందరు శాపాలు కూడా పెడుతున్నారు. అసలు ఎందుకు శాపాలు పెడుతున్నారో తెలుసా..

పందులు ఎగరుతాయి తెలుసా అంటూ చైనా టూరిజం డిపార్ట్ మెంట్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వారు చేసిన హడావిడికి చాలా మంది టూరిస్టులే అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడికి వచ్చిన టూరిస్టులకు  అక్కడి అధికారులు భలే బురిడీ కొట్టించారు. ఓ చిన్నపాటి బ్రిడ్జి మీదకు కొన్ని పందులను తీసుకెళ్లి వాటిని బ్రిడ్జి మీద నుండి తోసేశారు. దాంతో కిందనున్న లేక్ లో పడ్డ పందులు ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నాయి. అయితే పందులకు కూడా హక్కులుంటాయి.. అవీ ఇవీ అంటూ చాలా మంది దీనిపై విమర్శలు చేస్తున్నారు. అయినా టూరిస్టులను ఆకట్టుకోవడానికి ఇలా చేశాం కానీ పందులు అంటే మాకు ఎంతో ప్రేమ అంటున్నారు అధికారులు. వీళ్ల పందుల ప్రేమ తగలెయ్యా.. అని కొందరు తిట్టుకుంటున్నారట.

దీనిపై వచ్చిన కామెంట్స్ పై ఓ లుక్ వెయ్యండి..

china-pigs-comments

 

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pigs  China  Tourism  Shiyan lake  Bridge  

Other Articles