Georgia | zoo animals | come out side

Tigers lions and hippopotamus roam free in georgia s capital after flood

Georgia, zoo animals, come out side

Tigers, lions and hippopotamus roam free in Georgia's capital after flood. after severe flooding that killed at least 12 people in the Georgian capital Tbilisi

ITEMVIDEOS: రోడ్ల మీద సింహాలు, పులులు

Posted: 06/15/2015 09:17 AM IST
Tigers lions and hippopotamus roam free in georgia s capital after flood

అవును మీరు చదివింది కరెక్టే. రోడ్ల మీదకు సింహాలు, పులులు, హిప్పోలు వచ్చాయి. దాంతో జనాలు భయంతో పరుగులు తీశారు. ఎంతో కష్టపడి వాటన్నింటిని జూకు తరలించారు. ఇంతకీ ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా.? జార్జియాలో జరిగిన ఘటన. గత వారం రోజులుగా జార్జియాను వరదలు ముంచెత్తాయి. వరద నీటిదెబ్బకు ఊర్లకు ఊర్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. వేర్‌ నది పొంగడంతో...బిలిస్‌ నగరం జలదిగ్బంధంలో చిక్కకుకుపోయింది. వరద నీరు జూలోకి వచ్చి చేరడంతో జంతువులన్నీ బోన్లలో నుంచి తప్పించుకొని రోడ్లపైకి వచ్చాయి. ఇళ్లల్లోకి చొరబడి నానా హంగామా చేశాయి. రోడ్లపై, ఇళ్లలో జంతువులు హల్‌చల్‌ చేయడంతో జనాలు ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, జూ సిబ్బంది జంతువుల్ని పట్టుకోవడానికి నానా తంటాలు పడ్డారు. వారిని చూసిన జంతువులు వీధుల్లోకి పరుగులు తీశాయి. చెట్లు, వాహనాల చాటుకు వెళ్లాయి. కొన్ని జంతువులు ఇళ్ల కిటీకీల్లో నక్కాయి.


జంతువులు వారికి చిక్కకుండా కాసేపు చెమటలు పట్టించాయి. విసిగిపోయిన సిబ్బంది ఒక్కో జంతువును టార్గెట్‌ చేసి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి బంధించారు. ఇక మొసళ్లు కూడా చుక్కలు చూపించాయి. వీధుల్లో నీళ్లు నిలబడి పోవడంతో ఒడ్డుకు వస్తూ నీళ్లలోకి జారుకుంటూ వారిని ముప్పుతిప్పలు పెట్టాయి. చివరకు వలల సాయంతో వాటిని పట్టుకున్నారు. రాత్రింభవళ్లు రెండు రోజుల పాటూ కష్టపడిన సిబ్బంది జంతువులన్నిటిని పట్టుకొని బంధించడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంకెక్కడ ఏ జంతువుకు మిగింలుందోనని  ఆందోళన పడుతున్నారు స్థానికులు..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Georgia  zoo animals  come out side  

Other Articles