D Srinivas | TRS |Nizababad |congress | Ex PCC President

How many of the dsrinivas followers will join in the trs party is the new question

D Srinivas, TRS,Nizababad,congress,Ex PCC President,quits Congress,join TRS,Senior Congress leader,srinivas

How many of the DSrinivas followers will join in the TRS party is the new question. Former congress senor leader DS likely to join the TRS soon.

ఢిఎస్ వెంట వెళ్లేదెవరు..? తలగోక్కుంటున్న డిఎస్ శిష్యులు

Posted: 07/05/2015 10:27 AM IST
How many of the dsrinivas followers will join in the trs party is the new question

సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌ గులాబీ పార్టీ వైపు అడుగులు వేయడం నిజామాబాద్‌ జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా  హాట్‌టాపికే. ఆయన వెంట వెళ్లే వాళ్లెందరన్న చర్చ జిల్లాలో  జరుగుతోంది. ఎంతో మంది నాయకులను రాజకీయాలకు పరిచయం చేసిన ట్రాక్‌ రికార్డ్‌ డీఎస్‌ది. శిష్యగణంతో పాటు  అనుచరగణం లిస్ట్‌ పెద్దగానే ఉంది. మరి వాళ్లంతా ఇప్పుడు శీనన్న మాట వింటారా? మీ వెంటే మేమంటారా? అన్నదానిపై డీఎస్‌  వర్గీయుల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. డీఎస్ వెంట వెళ్లాలా? వద్దా? అని ఆయన అనుచరుల్లో కొందరు డైలామాలో ఉన్నారని సమాచారం. ఎందుకంటే డీఎస్‌నే నమ్ముకుని ఉన్న ఆయన అనుంగు అనుచరులకు సైతం డీఎస్ పార్టీ మారుతున్నారన్న విషయం చివరిదాకా తెలియకపోవటం ఆశ్చర్యం. మొదట్లో డీఎస్‌ టీఆర్‌ఎస్‌లోకి  వెళ్తున్నారన్న వార్తలు వచ్చినప్పుడు అనుచరులు ఖండించారు. కానీ ఆయన కారెక్కెయ్యడం ఖాయమైపోవడంతో వాళ్లంతా  ఆలోచనలో పడ్డారు. మాటమాత్రమైనా తమకు చెప్పకపోవటంతో వారు కొంత సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌కు డీఎస్‌ చేరుకోవడంతో జిల్లా కాంగ్రెస్‌లో వాతావరణం కాస్త మారిందని సమాచారం. పది మంది కార్పొరేటర్లు, ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ముగ్గురు డీఎస్‌తో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. వాళ్లు డీఎస్‌తో వెళ్లడం ఖాయమేనన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు జిల్లా కాంగ్రెస్‌ సీనియర్లు డీఎస్‌ వెంట ఎవరూ వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారని సమాచారం. షబ్బీర్‌ అలీ,  సుదర్శన్‌రెడ్డి, సురేష్‌రెడ్డి లాంటి నేతలు ఎప్పటికప్పుడు సెకండ్‌ కేడర్‌తో చర్చలు జరుపుతున్నారట. ఎమ్మెల్సీ ఆకుల లలిత, తాహెర్  బిన్ హందాన్, గడుగు గంగాధర్‌లతో ఎప్పటికప్పుడు ఫోన్లలో మాట్లాడుతున్న సీనియర్ల నేతలు డీఎస్‌తో ఎవరు వెళ్తున్నారు  అన్న దానిపై ఆరా తీస్తున్నారట. డీఎస్‌ అనుచరులకు సైతం ఫోన్లు వెళ్తున్నాయని తెలుస్తోంది. పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని, వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని సంప్రదింపులు జరుపుతున్నారట. మరి కాంగ్రెస్‌ నేతల ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలంటే డీఎస్‌  కారెక్కేవరకు ఆగాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : D Srinivas  TRS  Nizababad  congress  Ex PCC President  quits Congress  join TRS  Senior Congress leader  srinivas  

Other Articles