Kejriwal joins anna s protest on day 2 vows not to give up fight

Kejriwal joins Anna's protest, Kejriwal vows not to give up fight, Delhi Chief Minister Arvind Kejriwal, social activist Anna Hazare, contentious land ordinance, appealed to all parties to participate,

Delhi Chief Minister Arvind Kejriwal on Tuesday joined social activist Anna Hazare on his second day of protest against the contentious land ordinance and shared the dais with the social activist.

అన్నాతో వేదికపై కేజ్రీ.. అన్ని పార్టీలకు పిలుపు

Posted: 02/24/2015 10:18 PM IST
Kejriwal joins anna s protest on day 2 vows not to give up fight

సామాజిక కార్యకర్త అవినీతి వ్యతిరేక ఉద్యమకర్త, గాంధేయవాది అన్నా హజారే ఉద్యమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో అరవింద్ కేజ్రీవాల్ రెండవ రోజున హాజరయ్యారు. ఎన్డీయే భూసేకరణ ఆర్డినెన్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆయన సాగిస్తున్న ఉద్యమానికి కేజ్రీవాల్ మద్దతు పలికారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి రాజకీయ ఆరంగ్రేటం చేసిన కేజ్రీవాల్ సుమారు మూడేళ్ల తర్వాత కేజ్రీవాల్ మంగళవారంనాడు హజారేతో వేదికను పంచుకున్నారు. హజారే కేజ్రీవాల్‌ను వేదిక మీదికి ఆహ్వానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు దాదాపు అందరూ ఆందోళనలో హజారేతో కలిశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం తెస్తున్న వివాదాస్పదమైన చట్టంపై విరుచుకుపడ్డారు. లోకసభ ఎన్నికల్లో భారీ విజయాన్ని చేజిక్కించుకున్న బిజెపిని దాని పేదల వ్యతిరేక విధానాల వల్ల ఢిల్లీ ప్రజలు శిక్షించారని ఆయన అన్నారు ప్రస్తుత ప్రభుత్వం ప్రజల నుంచి గుణపాఠం తీసుకోవాలని ఆయన అన్నారు. మేలో జరిగిన లోకసభ ఎన్నికల్లో బిజెపికి ప్రజలు ఘన విజయాన్ని అందించారని, కానీ 8,9 నెలల్లోనే దాని విధానాల వల్ల బిజెపిని పెకిలించారని ఆయన అన్నారు. పేదలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టాలు చేస్తే ప్రజలు సహించబోరని ఆయన అన్నారు. ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.

అన్నా హజారే నాయకత్వంలోని దేశవ్యాప్త ఆందోళనకు తాము మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. ఢిల్లీ నగరంలో బలవంతంగా ఎవరు కూడా భూములు తీసుకోబోరని ముఖ్యమంత్రిగా తాను ప్రకటిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు అన్నా హజారేకు మద్దతు ఇచ్చారు. సిపిఐకి చెందిన అతుల్ అంజన్, ఎండిఎంకెకు చెందిన వైగో అన్నా హజారేకు మద్దతుగా వేదికపై కూర్చున్నారు. అన్నా హజారే తన గురువు అని, తన తండ్రిలాంటివారని, గాంధేయవాద ఉద్యమాన్ని హృదయపూర్వకంగా తాను బలపరుస్తానని కేజ్రీవాల్ చెప్పారు.

అన్నా చేపట్టిన  ఉద్యమానికి పలుపార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించి ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి సిద్ధమైయ్యాయి. అయితే తాను ఎట్టి పరిస్థితిల్లోనూ దీక్షకు మాత్రం దిగనని హజారే స్పష్టం చేశారు. దేశ ప్రజలకు తన ప్రాణాలు ముఖ్యమని.. అందుచేత ఉద్యమాన్ని పాదయాత్ర రూపంలో తీవ్ర స్థాయికి తీసుకువెళతానని ప్రకటించారు. పార్టీలకతీతంగా తన ఉద్యమం ఉంటుందన్నారు. ఈ ఉద్యమంలో ఏ పార్టీ అయినా పాల్గొని తమకు మద్దతు తెలుపవచ్చన్నారు. మూడు-నాలుగు నెలలపాటు తన ఉద్యమాన్ని కొనసాగిస్తానని హజారే తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anna Hazare  Arvind Hazare  Land ordinance  

Other Articles