Swine flu outbreak 774deaths 13 000 positive cases

Swine flu outbreak 774deaths, Swine flu outbreak 13,000 positive cases, Union Health Minister J.P. Nadda, Indian Council of Medical Research, Swine flu outbreak, H1N1 virus, Union Health Ministry, Swine flu in India, Swine flu deaths, Swine flu positive cases,

The number of deaths across India due to swine flu reached 774 on Friday, with 40 more people succumbing to the disease.

భారత్ లో కలకలం రేపుతున్న స్వైన్ ఫ్లూ

Posted: 02/21/2015 10:08 PM IST
Swine flu outbreak 774deaths 13 000 positive cases

భారత్ దేశ వ్యాప్తంగా మాయదారి మహమ్మారి రోగం స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. దక్షిణాఫ్రికాలో ఎబోలా వైరస్ తరహాలో ఈ వ్యాధి దేశంలో తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ వ్యాధి బారిన పడి ఈ గత రెండు రోజుల్లో మరో 31 మంది ప్రజలు ప్రాణాలను విడిచారు. శీతాకాలంలో అధికంగా వ్యాపించే ఈ వ్యాధి ఇప్పటికే వందల సంఖ్యలో భారత్ వాసుల ప్రాణాలను హరించింది. మరెందరో దేశీయులను తన బాధితులుగా మార్చుకుంది. ఈ వ్యాధి బారిన పడి దేశ వ్యాప్తంగా ఇప్పటికే 774 మంది ప్రాణాలను విడువగా, సుమారు 13 వేల మంది దీని బారిన పడి చికిత్స పోందుతున్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి మాసంలో మొత్తం 12 వేల 983 మంది హెచ్ వన్, ఎన్ వన్ వైరస్ భారిన పడ్డారని తెలిపింది. ఈ వ్యాధికి సంబంధించిన మందులు అందుబాటులో లేకపోవడంతో పాటు.. అస్పత్రులలో వార్డలు సంఖ్య కూడా పెద్దగా లేకపోవడంతో ప్రజలు ప్రాణాలను హరిస్తున్నాయని తెలిపింది. గత 19న కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణంకాల ప్రకారం 743 మంది ఫిబ్రవరి వరకు రోగం బారిన పడి ప్రాణాలను వదిలారు. కాగా అప్పటి వరకు 11 వేల 955 మందికి ఈ వ్యాధి సోకింది. కాగా విస్తృతంగా విజృంభిస్తున్న ఈ వ్యాధి గత రెండు రోజుల్లోనే సుమారు వెయ్యి మందికి సోకగా, దీని బారిన పడి ఈ రెండు రోజుల్లోనే 31 మంది ప్రాణాలను హరించారు.

తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో 25  స్వన్ ఫ్లూ కేసులు నమోదు కాగా, మొత్తంగా 190 మంది దీని బారిన పడి చికిత్స పోందుతున్నారు. తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా సమీక్షించారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు అన్ని విధాలుగా వైద్య సేవలను అందిస్తామని హామి ఇచ్చారు. కొంత మంది వ్యాధి గ్రస్తులను పరీక్షించి అధ్యయనం చేయాల్సిందిగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ నిపుణులను కూడా ఆయన అదేశించారు. మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని కోరారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swine flu  India  743 deaths  12  000 positive cases  

Other Articles