Kejriwal s second janta darbar from feb 25

Aravind Kejriwal's Janta Darbar, Kejriwal's second Janta Darbar from Feb 25, Delhi chief minister Arvind Kejriwal, AAP president Arvind Kejriwal, Kejriwal's second Janta Darbar at ghaziabad, ghaziabad, janata durbar, Aravind Kejriwal, Ghaziabad police, no vip passes at janata durbar,

Delhi chief minister Arvind Kejriwal to hold his second session of Janta Darbar from next Wednesday to Friday.

25 నుంచి కేజ్రీవాల్ రెండోదఫా ‘ప్రజాదర్భార్’

Posted: 02/21/2015 10:07 PM IST
Kejriwal s second janta darbar from feb 25

ఢిల్లీ ముఖ్యమంత్రి, అప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ నెల 25 నుంచి రెండో ధఫా ప్రజాదర్భార్ ను నిర్వహించనున్నారు. బుధవారం నుంచి ఢిల్లీలోని గజియాబాద్ లో ప్రారంభించనున్న ప్రజాదర్బార్ ను శుక్రవారం వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆప్ పార్టీ వర్గాలు గజియాబాద్ జిల్లా అధికారులకు ముందస్తు సమాచారంతో పాటు అనుమతి కోరుతూ ధరఖాస్తును సమర్పించారు. కాగా గజియాబాద్ పోలీసులు మాత్రం అప్ ప్రజాదర్బార్ నిర్వాహకులకు ఒక సూచన చేశారు.

గతంలో నిర్వహించిన ప్రజాదర్భార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి కొంత నిరాశ, నైరాశ్యం వెలువడ్డాయని దీంతో.. వారు రహాదరులపై నిరసనకు దిగారు. అలాంటి పరిస్థితులు పునారావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా సహకరించాలని కోరారు. ఇందులో భాగంగా ప్రజలు నేరుగా అరవింద్ కేజ్రీవాల్ ను కలవనుండడంతో పాటు ఆయనకు తమ సమస్యలను వెల్లబోసుకోనుండటంతో.. మధ్యలో ఎలాంటి వారిని అనుమతించకూడదని విన్నవించారు. గతంలో వీఐపీ పాసులతో మధ్యలో అనేక మంది గుంపులు గుంపులుగా చోరబడటంతో ప్రజలు విసుగెత్తిపోయారని చెప్పారు. అందువల్ల ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ప్రజాదర్భార్ లో ప్రత్యేక వీఐపీ పాసుల జారిని రద్దు చేయాలని కోరారు. అంతేకాకుండా మరో ధఫా ప్రజాదర్భార్ లో ప్రజల నుంచి తీసుకునే విజ్ఞప్తుల విషయంలో మెరుగైన వసతులు కల్పిస్తామని కేజ్రీవాల్ చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచనను ఆప్ నేతలు పాటిస్తారో లేదు వేచి చూడాలి మరి..

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  Janta Darbar  Ghaziabad  

Other Articles

Today on Telugu Wishesh