Actor rajasekhar rama naidu death news treatment cancer disease

rama naidu death news, rama naidu latest news, rajasekhar news, actor rajasekhar news, rama naidu rajasekhar news, rama naidu funeral

actor rajasekhar rama naidu death news treatment cancer disease : Actor and Doctor Rajasekhar told that when he gave treatment to him.. then he will become active and participated in all segments.

‘‘రామానాయుడు చాలా యాక్టివ్ గా వుండేవారు’’

Posted: 02/19/2015 06:40 PM IST
Actor rajasekhar rama naidu death news treatment cancer disease

గతకొన్నాళ్ల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు.. బుధవారం (18-02-2015) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే! ఈ విధంగా ఈయన ఆకస్మికంగా మృతిచెందడంపై యావత్ టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మొన్నటివరకు ఉత్సాహంగా వుంటూ అందరితోనూ స్నేహాపూర్వకంగా వున్న ఆయన.. ఇలా హఠాన్మరణం పొందుతారని భావించలేదని ప్రముఖులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నటుడు, డాక్టర్ రాజశేఖర్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆయనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.

ఓ డాక్టర్ గా తాను రామానాయుడుగారికి మూడు నెలల నుంచి ట్రీట్ మెంట్ చేస్తున్నట్లుగా రాజశేఖర్ తెలిపారు. ఈ మూడు నెలల్లో ఆయనకు తాను ఎంతో దగ్గరయ్యానని చెప్పారు. ఆయనకు మెడిసిన్స్ ఇచ్చినప్పుడల్లా ఎంతో యాక్టివ్ గా వుండేవారని, చురుకుగా అన్ని వ్యవహారాల్లో పాలుపంచుకునేవారని తెలిపారు. ‘‘స్టూడియో ఎలా వుంది? అక్కడ షూటింగ్ జరుగుతోందా..? ఓసారి వెళ్లా రావాలి..? అని ఆయన తాపత్రయపడేవారని రాజశేఖర్ గుర్తుచేసుకున్నారు. అంతేకాదు.. నాలుగైదురోజుల ముందు ఆయన చిన్న కొడుకు వెంకటేష్ ఇంటికి, అక్కడినుంచి నానక్ రామ్ గూడ స్టూడియోకి, అలాగే రామానాయుడు స్టూడియోకి.. ఇలా ఒక్కరోజులోనే మూడుచోట్ల సందర్శించారని అన్నారు. అంతా తిరిగినా కూడా ఎంతో ఎనర్జిటిక్ గా వుండేవారని పేర్కొన్నారు.

అలాగే.. నర్సాపూర్ లో ఆయన కట్టించిన ఓల్డేజ్ హోమ్ ను కూడా ఓసారి వెళ్లి చూసి రావాలంటూ రామానాయుడు చాలా ఆరాటపడ్డారని రాజశేఖర్ తెలిపారు. ఎప్పుడూ ఉత్సాహంగా వుంటూ బాధ్యత, పనులు, లక్ష్యం గురించే ఆలోచించేవారని చెప్పుకొచ్చారు. అయితే.. ఇంతలోనే ఆయన అనుకోకుండా ఇలా హఠాన్మరణం పొందుతారని భావించలేదని అన్నారు. అయినా.. ఆయన పూర్తి జీవితాన్ని అనుభవించారని అన్నారు. వారి కుటుంబసభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లుగా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rama naidu death news  actor rajasekhar interview  

Other Articles