Cbi examines former pm manmohan singh in coal scam

CBI examines Manmohan Singh in coal scam, former PM Manmohan Singh, coal block allocation scam, CBI officials examined manmohan, special CbI court, cbi questions on Hindalco, cbi questions allocation of Talabira II block to Hindalco, Manmohan Singh, Manmohan in coal scam|coal scam, Coal Block Allocation Scam, CBI

The CBI has examined former PM Manmohan Singh in connection with the coal block allocation scam, according to sources.

బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధానిని ప్రశ్నించిన సీబీఐ

Posted: 01/21/2015 07:55 AM IST
Cbi examines former pm manmohan singh in coal scam

బొగ్గు గనుల కేటాయింపుల స్కాం కేసుకు సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను సీబీఐ ప్రశ్నించినట్లు అభిజ్ఞవర్గాలు చెప్తున్నాయి. హిందాల్కో సంస్థకు బొగ్గు క్షేత్రాల కేటాయింపుకు సంబంధించి మన్మోహన్‌ను రెండు రోజుల కిందట ఆయన నివాసంలో ప్రశ్నించినట్లు ఆ వర్గాల సమాచారం. మన్మోహన్ ప్రధానిగా ఉన్న కాలంలో బొగ్గు మంత్రిత్వశాఖ కూడా ఆయన పర్యవేక్షణలో ఉన్నపుడు తాలాబిరా-2 బొగ్గు క్షేత్రాన్ని హిందాల్కోకు కేటాయించటంపై ఆయనను విచారించినట్లు తెలుస్తోంది.

అయితే.. ఈ వార్తలపై సీబీఐ అధికార ప్రతినిధి కంచన్‌ప్రసాద్‌ను సంప్రదించగా ఆయన ధ్రువీకరించటానికి కానీ, తిరస్కరించటానికి కానీ నిరాకరించారు. మన్మోహన్‌సింగ్ సహాయకులు మాత్రం అటువంటిదేమీ లేదని తిరస్కరించారు. ఈ కేసులో వివిధ కోణాలపై అప్పటి బొగ్గు శాఖ మంత్రి (మన్మోహన్‌సింగ్)ను విచారించకుండా.. కేసులో తుది నివేదికను అంగీకరించబోమని ప్రత్యేక న్యాయమూర్తి భరత్‌పరాశర్ పేర్కొన్న విషయం తెలిసిందే. బొగ్గు స్కాంపై దర్యాప్తునకు సంబంధించిన స్థాయీ నివేదికను సీబీఐ ఈ నెల 27వ తేదీన ప్రత్యేక కోర్టుకు సమర్పించాల్సి ఉంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manmohan Singh  Coal scam  CBI  

Other Articles