Kcr and kodandaram met on a stage

kcr and kodandaram meet, kcr and kodandaram met on a stage, Telangana chief minister KCR, telangana jac former chairman kodandaram, kcr and kodandaram meet at ravindra bharati, kcr and kodandaram greet one another, kcr and kodandaram meet one another,

kcr and kodandaram met on a stage in ravindra bharathi, greeted one another

ఏడు మాసాల ఏడబాటు ముగిసిందా..? కొనసాగనుందా..?

Posted: 12/30/2014 07:29 PM IST
Kcr and kodandaram met on a stage

తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు తరువాత ఏడబాటుగా వున్న ఇరువురు ఉద్యమ నేతలు సుమారు ఏడు మాసాల తరువాత కలిశారు. ఎన్నికల తరువాత చాల కాలానికి మొదటిసారిగా ఒకే వేదికపై కలుసుకున్నారు. రవీంద్రభారతిలో ఈరోజు టీఎన్జీఓ డైరీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరామ్ హాజరయ్యారు. ఎన్నికల తరువాత వీరిద్దరూ మొదటిసారిగా ఒకే వేదికపై కలుసుకున్నారు. ఇద్దరూ కరచాలనం చేసుకొని, ఒకరినొకరు పలకరించుకున్నారు.

 తెలంగాణ ఏర్పడిన తర్వాత కోదండరామ్కు అంత ప్రాధాన్యత లభించడం లేదన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది.  ఎన్నికల్లో గెలిచిన తరువాత  కోదండరామ్కు కేసీఆర్ అపాయింట్మెంట్ లభించలేదని ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా కోదండరాంకు ఆహ్వానంలేదని వార్తలు వచ్చాయి. అయినా  ఆయన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తరువాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా కోదండరామ్ను నియమిస్తారని ప్రచారం జరిగింది. ఆ స్థానంలో ఘంటా చక్రపాణిని నియమించారు.

 ఈ నేపధ్యంలో చాలా కాలం తరువాత వారిద్దరూ ఒకే వేదికపైన కలుసుకున్నారు. కరచాలనం చేసుకున్నారు. నవ్వుతూ పలకరించుకున్నారు. తన ప్రసంగంలో కూడా కేసీఆర్ నవ్వుతూ కోదండరామ్ను చూస్తూ ఆయన పేరును ప్రస్తావించారు. దీంతో వీరిద్దరి మధ్య గత ఏడు మాసాలుగా సాగుతున్న ఏడబాటు ముగిసిందని వార్తలు కూడా వినబడుతున్నాయి. అయితే కేవలం కార్యక్రమం కాబట్టి వారిద్దరూ ఒకరినోకరు పలకరించుకున్నారు. గౌరవంగా ఉభయ శుశలోపరి అడిగి తెలసుకున్నారని మరికోందరు అంటున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Kodanda ram  greet one another  meet  

Other Articles