Hyderabad airport high alert

Hyderabad airport high alert, Bomb threat to Hyderabad airport, High alert at Hyderabad airport, anonymous letter to airport authorities

Hyderabad airport on high alert, Bomb threat to Hyderabad airport

భయం గుప్పిట్లో హైద్రాబాద్ విమానాశ్రయం

Posted: 02/21/2014 01:00 PM IST
Hyderabad airport high alert

బాంబులతో పేల్చటానికి పేలుడు సామాన్లను ఒక విమానంలో తరలించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తు తెలియని వ్యక్తి రాసిన ఒక లేఖ అందటంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ముమ్మరంగా భద్రతా ఏర్పట్లను సరిచూస్తూ తనిఖీలను నిర్వహిస్తోంది.  కొందరు మఫ్టీలో కూడా విమానాశ్రయం లో తిరుగాడుతూ కదలికలను పరిశీలిస్తున్నారు. 

బెదిరింపు ఉత్తరం సాక్షాత్తూ విమానాశ్రయంలో ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కే చేరింది.  ఈ విషయాలను ధృవీకరించిన ఛీఫ్ సెక్యూరిటీ అదనపు డైరెక్టర్ జనరల్ దీని మీద మరిన్ని వివరాలను ఇవ్వటానికి నిరాకరించారు. 

అయితే విమానాశ్రయానికి ప్రయాణీకుల రాకపోకలకు అంతరాయం కలిగించలేదు.  తనిఖీలు చెయ్యటం, అప్రమత్తంగా మెలగటం మాత్రమే చేస్తున్నారు.  పోలీసు జాగిలాలు, బాంబు నిర్వీర్యం చేసే సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. 

బెదిరింపు లేఖను పోలీసులకు పంపించగా, ఆ లేఖలో ఎంత నిజం ఉంది, అది ఎక్కడి నుండి వచ్చిందన్న విషయాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles