Errabelli dayakar rao comments on kcr

errabelli dayakar rao comments on kcr, Errabelli Dayakar Rao Fire on KCR, Errabelli Dayakar Rao, Errabelli Dayakar Rao Comments On Telangana,

errabelli dayakar rao comments on kcr, Errabelli Dayakar Rao Fire on KCR

గులాబీ వలనే తెలంగాణ లేటు అవుతుంది?

Posted: 09/24/2013 11:31 AM IST
Errabelli dayakar rao comments on kcr

గులాబీ నేత కేసిఆర్ వైఖరి వల్లే తెలంగాణ బిల్లు ఆలస్యమవుతోందని తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ లో మీడియా సమావేశంలో మట్లాడుతూ కేసిఆర్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ లో విలీనం కాము, పొత్తు కూడా ఉండదని కేసిఆర్ బహిరంగంగా చెప్పగలరా? అన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ , వైకాపాలతో కేసిఆర్ కుమ్మక్కయ్యారని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. తెలంగాణలో రూ. 43వేల కోట్ల ఆస్తులు దోజుకున్న జగన్ కు కేసిఆర్ మద్దతా? అని ప్రశ్నించారు. కేసిఆర్ పరోక్షంగా జగన్ తో పొత్తు పెట్టుకున్నట్లు ఉందని ఆరోపించారు. అందుకే సీమాంద్రలో జగన్ కు ఎక్కువ సీట్లు వస్తాయని కేసిఆర్ చెబుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆందోళనలను ద్రుష్టిలో పెట్టుకొనే చంద్రబాబు లేఖ ఇచ్చారని తెలిపారు. సీమాంద్రకు న్యాయం చేయాలని మా నేత కోరుతున్నారని దానిలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం యూ టర్న్ తీసుకుంటే తెలంగాణ రాదని కేసిఆర్ కు తెలుసని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles