Kishan reddy to remain as bjp president

bjp Kishan Reddy, state president of BJPVidyasagar,Rajnath Singh,Narendra Modi,Bandaru Dattatreya,

G Kishan Reddy on Sunday was appointed as the state president of BJP for a second term.

Kishan Reddy to remain as BJP president.png

Posted: 02/11/2013 11:05 AM IST
Kishan reddy to remain as bjp president

kishan-reddyబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్లీ కిషన్ రెడ్డీనే నియమితులయ్యారు. మొన్నటి వరకు తనను పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పించాలని బీజేపీ అధినాయకత్వానికి విన్నవించుకోవడంతో ఎవర్ని నియమించాలని తలపట్టుకున్న అధినాయకత్వం పార్టీ పరిశీలన కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి మళ్లీ ఆయనకే పట్టం కట్టారు.  ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్‌నాథ్‌తో కిషన్‌కు ఎప్పటినుంచో ఉన్న పరిచయం, ఇతర అంశాలే ఆయన ఎన్నిక కావడానికి దోహదం చేశాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. కిషన్‌రెడ్డి యువకుడు, పట్టుదల గల వ్యక్తి, పార్టీయే లోకంగా జీవిస్తారంటూ రాజ్‌నాథ్ గతంలో పలు సందర్భాల్లో ప్రశంసించారు. కాగా.. కిషన్ నిమాయకంతో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు వేర్వేరు కమిటీలు ఉండబోవని తేలిపోయింది. రెండోసారి ఎన్నికైన కిషన్ రెడ్డి తాను ఒక కార్యకర్తను మాత్రమే అని, తెలంగాణ కోసం పోరాడుతున్నామని ఆయన చెప్పారు.రెండువేల పద్నాలుగు నాటికి తెలంగాణ, సీమాంద్రలలో బిజెపి మరిన్ని సీట్లు గెలుచుకునేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. తనను ఎన్నుకున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nallari kira kumar reddy
Mohan babu father passes away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles