Gali muddu krishnama naidu fire on cm kiran

gali muddu krishnama naidu, tdp leader, Congress party, gali muddu krishnama naidu fire on cm kiran, telugu mahasabalu, chief minister n kiran kumar reddy, cm brother kishore, 25 crores, 2014 election,

gali muddu krishnama naidu fire on cm kiran

muddu krishnama naidu.gif

Posted: 12/08/2012 03:58 PM IST
Gali muddu krishnama naidu fire on cm kiran

gali muddu krishnama naidu fire on cm kiran

భాషపై అభిమానంతో కాక డబ్బులు దోచుకోవడానికే సీఎం సోదరుడు కిషోర్ ప్రపంచ తెలుగు మహా సభలకు అవిలాల చెరువును ఎంపిక చేశారని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించారు. తెలుగు సభలకు తొలుత రూ.25 కోట్లు అంచనా వేసిన అధికారులు దాన్ని రూ.45 కోట్లకు పెంచడం కూడా కిషోర్‌కు లబ్ధి చేకూర్చడానికేనన్నారు.  తెలుగు సభల నిర్వహణ అవిలాల చెరువులో వద్దని తాను మొదటే చెప్పానన్నారు.డిసెంబర్ నెలలో వర్షం వస్తుందని అధికారులకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఈ వర్షంతో అవిలాల చెరువులో కోట్లాది రూపాయల ఏర్పాట్లు కొట్టుకు పోయాయంటూ తప్పుడు లెక్కలు సృష్టించి సుమారు రూ.20 కోట్లకు పైగా కిషోర్ జేబులోకి తరలిస్తున్నారని విమర్శించారు. మరోపక్క ముఖ్యమంత్రి కిరణ్ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ఇంట్లో కూర్చుని డబ్బులు ఇచ్చే ఫైళ్ళకు మాత్రమే సంతకం చేస్తున్నారని విమర్శించారు.రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని, ఇప్పటికే సుమారు 30వేల పరిశ్రమలు మూతపడగా, 7 లక్షల  మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు.టీడీపీ ద్వారా ఎమ్మెల్యేలుగా గెలిచిన అమరనా«థ రెడ్డి, ప్రవీణ్‌కుమార్ రెడ్డి ముందు రాజీనామా చేసి తరువాత వైకాపా తరపున మాట్లాడాలని డిమాండ్ చేశారు.జైల్లో వున్న జగన్‌కు రాజభోగాలు అమరుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆ రెండు పార్టీలు కుమ్ముక్కయ్యాయనడానికి నిదర్శనంగా చెప్పవచ్చునన్నారు.2014లో టీడీపీ అఖండ విజయం సా«ధించి చంద్రబాబు సీఎం కావడం ఖాయమని ముద్దుకృష్ణమ జోస్యం చెప్పారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leaders absent reasons
Mp lagadapati rajagopal new plan on telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles