Doctor dies in accident on orr

The victim is the son of late former Minister, Puli Veeranna of Mahabubnagar district, the Petbasheerabad ACP, Syed Rafeeq, said. The doctor was alone and driving a Ford Fiesta on the Kandlakoya-Shameerpet stretch of the ORR

The victim is the son of late former Minister, Puli Veeranna of Mahabubnagar district, the Petbasheerabad ACP, Syed Rafeeq, said. The doctor was alone and driving a Ford Fiesta on the Kandlakoya-Shameerpet stretch of the ORR

Doctor dies in accident on ORR.png

Posted: 08/22/2012 01:32 PM IST
Doctor dies in accident on orr

Praveen

హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. గతంలో  కోటశ్రీనివాస రావు కుమారుడు, అజహరుద్దీన్ కుమారుడు, మంత్రి కోమటి రెడ్డి కుమారుడు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా నిన్న రాత్రి మరో రాజకీయ నాయకుడి కుమారుడి ప్రాణాలు బలిగొంది. మాజీ మంత్రి పులి వీరన్న తనయుడు డాక్టర్ ప్రవీణ్ తేజ (38) దుర్మరణం పాలయ్యారు. మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రాజీవ్ రహదారి నుంచి కొంపల్లి వైపు వెళ్లేందుకు ఔటర్ రింగ్‌రోడ్డు సర్వీసు రోడ్డులో తన కారు(ఏపీ22క్యూ909)లో అతి వేగంతో వెళ్తుండగా.. షామీర్‌పేటకు రెండు కిలోమీటర్ల దూరంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. దీంతో తల పగిలి.. ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.
ఈయన ఆర్థోపెడిక్ వైద్యునిగా పనిచేస్తున్నారు. లండన్‌లో  వైద్యునిగా పనిచేసిన ఈయన ఇటీవలే స్వదేశానికి వచ్చి, హైదరాబాద్‌లో ప్రాక్టీసు చేయడం మొదలుపెట్టారు. ఆయన భార్య విజయ గైనకాలజిస్టు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. కస్మికంగా ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పులివీరన్న సొంత గ్రామమైన మహబూబ్‌నగర్‌లో విషాదం అలుముకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rail engine found after few months
Court adjourns mopidevi bail petition  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles