Family suicide in saroor nagar

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Six woman dead bodies found in Saroornagar lake of Hyderabad on wednesday morning. Three bodies age between thirty to forty and another three bodies are seven to ten years

Family suicide in saroor nagar.gif

Posted: 04/18/2012 01:49 PM IST
Family suicide in saroor nagar

రాష్ట్ర రాజధాని నడిపొడ్డున విషాదం వెలుగు చూసింది. హైదరాబాద్ లోని సరూర్ నగర్ చెరువులో ఆరు మృతదేహాలు అభ్యం అయ్యాయి. సరూర్ నగర్ చెరువులో మృతదేహాలు ఉన్న విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారు అందరూ ఆడవారే అని తెలుస్తోంది. వారిలో నలుగు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శవాలు పూర్తిగా ఉబ్బిపోయి ఉన్నాయి. దీంతో మూడు రోజుల క్రితమే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా భావిస్తున్నారు. ఆరుగురిది ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ హత్య కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.

మృతదేహాల కాళ్లు, చేతులు ప్లాస్టిక్ తాడుతో కట్టి ఉంది. దీంతో హత్య కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నారు. సరూర్ నగర్ చెరువులో మృతదేహాల విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు అక్కడకు భారీగా తరలి వచ్చారు. వారెవరూ స్థానికులు కాదని తెలుస్తోంది. దీంతో ఇతర ప్రాంతం నుండి వచ్చిన వారు కాళ్లు, చేతులు కట్టుకొని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటారని లేదా వేరే ప్రాంతం నుండి ఎవరైనా తీసుకు వచ్చి చెరువులో పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణ తరువాత వివరాలు తెలిసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mitt romney gaining on barack obama
Auction of mahatma valuables  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles