Malaria in vijayawada

malaria in vijayawada, malaria, Vijayawada Municipal Corporation, malaria cases. breaking news, ap politics, political news, andhra news

malaria in vijayawada

నగరంలో మలేరియాపై హై అలెర్ట్

Posted: 06/13/2013 06:09 PM IST
Malaria in vijayawada

విజయవాడ నగరంలో మలేరియాపై హై అలెర్ట్ ప్రకటించాలని అధికారులు కోరుతున్నారు. మలేరియాపై హై ఎలర్ట్‌గా ఉండేందుకు నగర పాలక సంస్థ అధికారులు కార్యాచరణకు పూనుకున్నారు. ఇక ప్రతి శుక్రవారంను డ్రై డేగా పరిగణించాలని సంబంధిత అధికారులకు నగర పాలక సంస్థ కమిషనర్ పండాదాస్ ఆదేశించారు. మలేరియా జ్వరాలు ఎక్కువగా నమోదు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన సంబంధిత ఆరోగ్యశాఖ అధికారులకు, సంబంధిత అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మలేరియా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.

మలేరియా రావడానికి కారణమైన దోమల నివారణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని చెప్పారు. రాడికల్ ట్రీట్‌మెంట్ ద్వారా మలేరియా పారసైట్‌ను ఎదుర్కోవాలన్నారు. నగరంలో జ్వర బాధితులు నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 1800-425-2000 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి వివరాలు అందించాల్సి ఉంటుందని, దీనిపై ప్రజలలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్ జి.కొండలరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఎం.సత్యనారాయణరాజు, నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు, జిల్లా మలేరియా విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more