Rules to write ramakoti book

ramakoti book, ramakoti book online, ramakoti book rules, how to write ramakoti book, rules to write ramakoti book, ramakoti book onine, ramakoti book download, ramakoti book download online, ramakoti book rules in telugu, rule to write ramakoti book in telugu, how to write ramakoti book in telugu

There are some Rules to write ramakoti book which are mainly imported to follow and more

రామకోటి రాయడానికి నియమాలు

Posted: 04/09/2014 06:36 PM IST
Rules to write ramakoti book

రామకోటి రాయడమనేది ఒక మంచి ఆలోచన. ఇలా రాయడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి. అయితే రామకోటిని రాయడానికి ముందు కొన్ని నియమాలను పాటించాల్సి వుంటుంది. ఎలాపడితే అలా, ఎక్కడబడితే అక్కడ రాయకుండా... భక్తిశ్రద్ధలతో ఒక క్రమబద్ధమైన ప్రణాళికలను ఏర్పరుచుకుని రాస్తే.. చాలా మంచిది. 

రామకోటి రాయడానికి నియమాలు :

- రామకోటి రాయాలన్న ఆలోచన మీకు కలిగినప్పుడు ముందుగా భక్తితో దేవుడి దగ్గర సంకల్పం చేసుకోవాలి. అప్పుడు మానసికంగా ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా హాయిగా అనిపిస్తుంది. 

- ‘శ్రీరామ’ అని రాయడానికి వీలుగా కోటి గళ్లున్న పుస్తకాన్ని కొనుక్కోవాలి. ఇలా కుదరని పక్షంలో మీరే తెల్లకాగితాలతో ఒక పుస్తకాన్ని తయారుచేసుకుని, అందులో రాసుకోవచ్చు. 

- రామకోటి మొదలుపెట్టడానికి ముందు శాస్త్రాలప్రకారం ఒక మంచి సమయాన్ని కేటాయించుకోవాలి. మీరు రాయదలచిన పుస్తకానికి పసుపు, కుంకుమను రాసి... దేవుని సన్నిధిలో శ్రీరామ అష్టోత్తరశతనామావళితో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఆ తరువాత పుస్తకంలో రాయడానికి పూనుకోవాలి. 

- రామకోటి పుస్తకం రాయడం మొదలుపెట్టిన తరువాత మనసులో ఎటువంటి ఆలోచనలు, చింతలు పెట్టుకోకుండా.. దేవుని మీద భక్తితో, ఏకాగ్రతతో మనసును కేంద్రీకరించి రాయాలి. 

- పుస్తకం రాస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా అవసరమైన పని వచ్చినప్పుడు సరిసంఖ్యలో పుస్తకాన్ని ఆపి వెళ్లాలి. తిరిగి ప్రారంభించడానికి ముందు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోని మొదలుపెట్టాలి. 

- రామకోటి పుస్తకం రాయడానికి ఉపయోగించే కలాన్ని కూడా ప్రత్యేకంగా పెట్టుకోవాలి. ఎక్కడబడితే అక్కడ పడివేయకూడదు. అదేవిధంగా పుస్తకంలో ఇతర విషయాల గురించి రాయకూడదు. 

- పుస్తకాన్ని బలవంతంగా రాయకూడదు. మీకు రాయాలనే సంకల్పం కలిగినప్పుడే దానిని పూర్తి చేయగలరు. అలా రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ వుండదు. అయితే పవిత్రత మాత్రం తప్పక పాటించాలి. 

- రామకోటి రాస్తున్న పుస్తకంలో ప్రతి లక్ష నామాలకు ప్రత్యేక పూజలు నిర్వహించుకుని, నివేదన చేసుకోవాలి. తరువాత అందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టాలి. 

- రామకోటి పుస్తకం రాయడం పూర్తయిన తరువాత పూజ, నివేదనలు సమర్పించి ఆరాధన చేసుకోవడం మంచిది. ఆశించిన ఫలితాలు సమకూరుతాయి. 

- ఇలా ఈ విధంగా రామకోటి పుస్తకం పూర్తయిన తరువాత పుస్తకాన్ని ఏదైనా రామునిగుడిలో ఆధ్యాత్మిక వ్యక్తికి అప్పగించాలి. అలా కానివేళ నదిలో వదలేయాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Pilli shakunam

  పిల్లి శకునం

  Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more

 • Why we use silk clothes in every occasion

  పట్టుబట్టలే ఎందుకు..?

  Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more

 • What is the benefit with mounvrath

  మౌన వ్రతం ఎందుకు???

  Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more

 • What is the eft fall sign

  బల్లి శకునం

  Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more

 • Some unbelives actually have scientific reasons

  మూఢనమ్మకమా... మూలం ఉన్న విశేషమా???

  Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more

Today on Telugu Wishesh