What is the EFT fall sign

What is the eft fall sign

EFT, Hindu, Culture, Traditions, EFT

many of Hindus EFT fall in sign as bad. But in our traditions there is not specified this. Actually many of the EFT are normal but some of them poisonous

బల్లి శకునం

Posted: 01/07/2016 04:36 PM IST
What is the eft fall sign

బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల మీద పడినా, నానా హైరానా పడిపోతాం మనం... బల్లి మన శరీర భాగాల మీద, గోడ మిది నుంచి జారి పడితే, ముందు తలారా స్నానం చేస్తాం, అంతకన్నా ముందు హడాలిపోతాం, ఆ తరువాత, ఏ భాగం మీద పడిందో మరోసారి గుర్తు చేసుకుని, "బల్లి శకునం" అంటే బల్లి ఏ శరీర భాగం మీద పడితే, ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ ఆపత్తు ముంచుకొస్తుందో, అయితే పెద్దవాళ్ళని, లేదా పుస్తకాలనీ, ఈ మధ్య అయితే, ఇంటర్నెట్ ని కూడా అడిగే ప్రయత్నం చేస్తాం... బల్లి విషపూరితం అని కూడా మన నమ్మకం... ఇంకోటి, కంచికి వెళ్లి బంగారు బల్లిని తాకి ఒస్తే, బల్లి పొరపాటున పడినా, కావాలని మన మీద పడినా, ఎటువంటి దోషం ఉండదు అని మన నమ్మకం...

ఇన్ని నమ్మకాలలో, ఏది నిజం?
దాదాపు 6000 పై చిలుకు బల్లి రకాలలో, యేవో కొన్ని మాత్రమే విషపూరితం అయినవి, అది కూడా కొంతవరకే... కానీ, ఇళ్ళల్లో తిరుగుతూ, దీపాల దగ్గర, ఇతర ప్రదేశాలలో సంచరించే పురుగుల్ని తినే బల్లులు, విషపూరితమైనవి కావు. బల్లికి మాత్రం, మన మీద పడటం ఇష్టమా లేక వాటికి మనం అంటే పగా? వాటి కాళ్ళ మధ్యలో ఉండే పల్చటి శరీరం, వాటిని గోడలకు అతుక్కుని ఉండేలా చేస్తుంది... వీటి శరీరంలోనూ జరిగే రసాయనిక మార్పుల వల్ల, ఈ శరీరం మరింత పలుచాబడుతుంది... అప్పుడు పట్టుజారి, పొరపాటున, పాపం ఇవి మన మీద పడిపోతూ ఉంటాయి.

బల్లి పడటం వల్ల చెడే జరుగుతుంది అని నమ్మని వారు, ఫలానా శరీర భాగాల మీద బల్లి పడితే, మంచి కూడా జరుగుతుంది అంటారు తప్ప ఇంక వేరే కారణాలు యేవే కావు. మనం మాట్లాడుకుంటున్నప్పుడు పాపం దాని మానాన అది, "ఠీక్" అని మూడు సార్లు అరుస్తుందే తప్ప, అది అరిస్తే మాట నిజమౌతుందని అనుకోవడం, మన మీద మనకున్న నమ్మకం యెంత బలహీనమైనదో, ఇందుకు ఉదాహరణ.

నమ్మకం మంచిదే... కానీ మూఢనమ్మకమే ప్రమాదం!


*సునయన బాదం*

NOTE: We inform you that we are not owner of any of the products, images or any other products displaying on our website. But all the articles are written by us and we owned them. If you found any image or product that found under your copyrights then please feel free to CONTACT US. We will remove that image or product as soon as possible. All the images are collected from Google.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : EFT  Hindu  Culture  Traditions  EFT  

Other Articles

  • Pilli shakunam

    పిల్లి శకునం

    Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more

  • Why we use silk clothes in every occasion

    పట్టుబట్టలే ఎందుకు..?

    Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more

  • What is the benefit with mounvrath

    మౌన వ్రతం ఎందుకు???

    Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more

  • Some unbelives actually have scientific reasons

    మూఢనమ్మకమా... మూలం ఉన్న విశేషమా???

    Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more

  • Bathing importance according to hinduism types of bath

    హడావుడిగా స్నానం చేయడం సరైంది కాదు!

    Oct 13 | ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతిఒక్కరికి స్నానం ఎలా చేయాలోనన్న విషయం అస్సలు తెలియదు. హడావుడిగా బాత్‌రూమ్‌లోకి వెళ్లడం, అలా నాలుగు మగ్గులు ఒంటి మీద నీళ్లు చల్లుకుని స్నానం అయ్యిందనిపించుకుని పనులకు బయలుదేరడం.. ఇలా... Read more

Today on Telugu Wishesh