Normalcy returns to dilsukhnagar

dilsukhnagar, normalcy returns to dilsukhnagar , hyderabad twin blasts, dilsukhnagar blast, hyderabad police, im recce, indian mujahideen, august pune blasts

normalcy returns to dilsukhnagar

blast-day.gif

Posted: 02/26/2013 03:49 PM IST
Normalcy returns to dilsukhnagar

Normalcy returns to Dilsukhnagar

మలిసంధ్య వేళ...అప్పుడప్పుడే చీకట్లు పరుచుకుంటున్నాయి. నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రం దిల్‌సుఖ్‌నగర్‌లో జనం రద్దీ ఎక్కువగా ఉంది. శిక్షణా కేంద్రాల నుంచి విద్యార్థులు ఇంటికి బయలుదేరారు. కార్యాలయాలు వదిలిన ఉద్యోగులు తమకు కావలసినవస్తువులు కొనుక్కొని ఇంటిదారి పట్టారు. ఇంకొందరు సరుకులు కొనుగోలు చేస్తున్నారు. కొందరు హోటళ్లలో, టిఫిన్ సెంటర్లలో అల్పాహారం తీసుకుంటున్నారు. దుకాణాలు,రహదారులు కిక్కిరిసి ఉన్నాయి. సరిగ్గా ఆ సమయంలోనే ముష్కరులు నిముషాల వ్యవధిలో రెండు బాంబులను పేల్చారు. భారీ విస్ఫోటనం, కళ్లు చెదిరే మంటలు, ఎగిరిపడిన మనుషులు, వాహనాలు. అప్పటివరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతంలో రెప్పపాటులోనే జన జీవనం కకావికలమైంది. పలు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పదుల సం ఖ్య లో క్షతగాత్రులయ్యారు.

Normalcy returns to Dilsukhnagar

కాళ్లు తెగిపోయి కొందరు, చేతులు కోల్పోయి ఇంకొందరు, శరీర భాగాలు ఛిద్రమై కొందరు. క్షణాలలోనే ప రిస్థితి హృదయవిదారకంగా మారింది. అధికంగా రద్దీ ఉన్న ప్రాంతాలను అప్పటికప్పుడు ఎంచుకుని బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు అనుమా నాలు వ్యక్తం అవుతున్నాయి. కమిషనర్ అనురాగశర్మ సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి వెళ్లిన కొద్ది నిమిషాలలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆనాటి సంఘటన నుంచి స్థానికులు ఇంకా తేరుకోలేదు. దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతం అర్ధరాత్రి వరకు నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ పలు జిల్లాలకు చెందినవారు నివసిస్తారు. దూరప్రాంతాలకు వెళ్లేవారు ఇక్కడి బ స్టాండ్ నుంచి రాకపోకలు సాగిస్తారు. సాయంత్రం పలువురు చౌరస్తాకు చేరుకుని మిత్రులను కలసి పిచ్చా పాటిగా మాట్లాడుకుంటారు. కొందరు టీ తాగడానికి వస్తారు. కోచింగ్ సెంటర్లు ఉన్నందున విద్యార్థులు ఎక్కువగా కనిపిస్తారు. భారీ వస్త్రాల దుకాణాలున్నాయి. చిరువ్యాపారులు పుట్‌పాత్‌లపై దుకాణాలు నడుపుతుంటారు. అందుకే బాంబు పేలుళ్లలో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. క్షతగాత్రుల సంఖ్య కూడా పెరిగింది. ఏం జరిగిందోనని తెలుసుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది. కొందరు క్షణాలలోనే తేరుకుని 108కు ఫోన్ చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.

Normalcy returns to Dilsukhnagar

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dilsukhnagar shows guts returns to normal
Pm seeks proposal to improve security in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more