Pumpkin egg faceback skin glow beauty tips

Pumpkin Egg facepack, beauty facepacks, pumpkin egg beauty facepack, pumpkin egg skin glow, beauty tips telugu, egg facepack, pumpkin facepack, egg healthy ingradients, egg paste

Pumpkin Egg faceback skin glow beauty tips : the increase the skin glow levels.. pumpkin egg facepack is best. It contains number of nutritions.

చర్మకాంతి కోసం గుమ్మడి-గుడ్డు ఫేస్’ప్యాక్..

Posted: 01/13/2015 03:43 PM IST
Pumpkin egg faceback skin glow beauty tips

ముఖవర్ఛస్సును మరింతగా మెరుగుపర్చుకోవడం కోసం ఎన్నోరకాల ఫేస్ ప్యాక్స్ అందుబాటులో వున్నాయి. ప్రకృతిలో లభించే సహజ వనరుల ద్వారా తయారుచేసే ఈ ఫేస్ ప్యాక్స్’లలో చర్మానికి కావలసిన ఎన్నో పోషకాలు పుష్కలంగా వుంటాయి కాబట్టి.. అవి చర్మకాంతిని పెంచడంతోబాటు చర్మాన్ని ఆరోగ్యంగా వుంచడంలో ప్రముఖపాత్రను పోషిస్తాయి. మార్కెట్’లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్’ను వాడటం కన్నా.. అలాగే రెగ్యులర్’గా బ్యూటీ పార్లర్’కు వెళ్లడం కన్నా.. సహజవనరుల ద్వారా తయారయ్యే ఫేస్ ప్యాక్స్’ను వాడటమే ఎంతో శ్రేయస్కరం. అయితే.. వీటిని ఇంట్లోనే చేసుకుని ముఖానికి పట్టిస్తే.. మరింత మంచిది.

ప్రస్తుతం అమలులో వున్న వివిధరకాల ఫేస్ ప్యాక్’లలో గుమ్మడి-గుడ్డు ఫేస్ ప్యాక్ ఒకటి! ఇందులో వుండే గుమ్మడికాయ, గుడ్డులో ఎన్నోరకాల పోషక విలువలు నిల్వవుంటాయని అందరికీ తెలిసిందే! అవి.. చర్మంలోని కణాల పనితీరును ఉత్తేజపరిచి.. చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్రను పోషిస్తాయి. కాబట్టి.. ఈ రకమైన ఫేస్ ప్యాక్ చర్మానికి ఎంతో మంచిది. మరి.. దీన్నెలా చేస్తారో, ఎలా అప్లై చేయాలో తెలుసుకుందామా...

గుమ్మడి-గుడ్డు ఫేస్ ప్యాక్:

* ఒక గుడ్డులోని తెల్లసొనకు గుమ్మడి గుజ్జు, పాలు, తేనెను చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించుకోవాలి. 15 నిముషాలవరకు అలాగే వుంచిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు పూర్తిగా తొలగిపోయి.. చర్మం కాంతివంతంగా, సౌందర్యంగా తయారవుతుంది.

* అలాగే గుమ్మడికాయను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్టును సున్నితంగా ముఖానికి పట్టించుకోవాలి. 10 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. అద్భుతమైన మార్పును గమనించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pumpkin egg facepacks  beauty tips telugu  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more