Tips for fresh looking face

Tips for Fresh Looking Face, fresh face, Tips for face fresh look.

Tips for Fresh Looking Face, fresh face, Tips for face fresh look.

ముఖం కాంతి వంతంగా మెరవాలంటే..

Posted: 07/03/2014 07:39 PM IST
Tips for fresh looking face

నిత్యం దుమ్ము, ధూళితో మన ముఖం జిడ్డుబారి పోతుంది. దీంతో ముఖం అంద విహీనంగా తయారవ్వడమే కాకుండా, ముఖం పై మచ్చలు ఏర్పడతాయి. ముఖం ఎప్పుడు తాజాగా ఉండాలంటే రాత్రి నిద్రకు ముందు ముఖాన్ని క్లీన్సర్‌తో శుభ్రపరుకోవటం ఎంతో అవసరం. క్లీన్సర్ వల్ల చర్మ రంథ్రాలు శుభ్రపడి చర్మపు సహజ నూనెలు స్రవిస్తాయి. ఫలితంగా ముఖ చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి. అయితే మార్కెట్లో మనకెన్నో క్లీన్సర్లు దొరుకుతున్నాయి. కానీ వాటిలోని రసాయనాల గాఢత మూలంగా చర్మంపై మురికితోపాటు చర్మపు సహజ నూనెలు కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లోనే క్లీన్సర్లను తయారుచేసుకోవాలి.

- పాలు సహజసిద్ధమైన క్లీన్సర్. నిద్రకు ముందు పచ్చి పాలలో దూది ముంచి ముఖం, మెడ రుద్దుకోవాలి. ఆరిన తర్వాత మళ్లీ రిపీట్ చేయాలి. ఆ తర్వాత పూర్తిగా ఆరనిచ్చి చల్ల నీళ్లతో ముఖం కడిగేసుకోవాలి.

- నూనె చర్మం: శనగపిండి, పచ్చిపాలు, పసుపు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేసుకుంటే చర్మం తాజాగా మారుతుంది.

- పొడి చర్మం: తేనె, పెరుగులతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. తేనె, పెరుగులు మాయిశ్చరైజర్‌లా పని చేసి పొడి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

- నార్మల్ స్కిన్: దోసకాయ తరుగుతో ముఖంపై గుండ్రంగా రుద్దుకోవాలి. లేదా దోస రసం, పెరుగు సమపాళ్లలో కలుపుకుని ముఖానికి అప్లై చేయాలి. 5 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

- అన్ని చర్మ తత్వాలు: అన్ని రకాల చర్మ తత్వాలకు సూటయ్యే క్లీన్సర్...రోజ్ వాటర్. రాత్రి నిద్రకు ముందు రోజ్‌వాటర్‌ను ముఖం మొత్తం అద్దుకుని పడుకుంటే తెల్లారేసరికి చర్మం మృదువుగా మారుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more