The Biography Of malathi krishnamurthy holla | International para athlete

Malathi krishnamurthy holla biography famous indian sportsperson

malathi krishnamurthy holla news, malathi krishnamurthy holla biography, malathi krishnamurthy holla history, malathi krishnamurthy holla life story, indian para atheletes, indian athletes, famous indian sportspersons, famous indian athlete

malathi krishnamurthy holla biography famous indian sportsperson : The Biography Of malathi krishnamurthy holla who is an International para athlete from India. She was awarded Arjuna award and Padma Shri for her achievements.

వికలాంగులకు ఆదర్శంగా నిలిచిన ‘విశ్వశ్రేష్ట మహిళ’

Posted: 04/02/2015 01:54 PM IST
Malathi krishnamurthy holla biography famous indian sportsperson

అంగవైకల్యం వున్నవారు తమకున్న ఆ లోపాన్ని గుర్తుంచుకుని నిత్యం ఆవేదన చెందుతుంటారు. నలుగురిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేమన్న బాధ వారిని వెంటాడుతూ వుంటుంది. అయితే.. లక్ష్యాన్ని ఛేధించడానికి అంగవైకల్యం అడ్డురాదని తమ ప్రతిభతో నిరూపించిందో భారతీయ ధీరవనిత! ఆ సమస్యతో కుమిలిపోతున్న వారందరికీ ఆదర్శంగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుకుంది. ఆమే మాలతి కృష్ణమూర్తి హొళ్ళ. 14 నెలల వయస్సులోనే వైరల్ జ్వరంతో శరీరమంతా పక్షవాతంతో చచ్చుబడిపోయిన ఆమె... జాతీయ స్థాయిలో సుమారు 300 స్వర్ణ, కాంశ్య పతకాలు గెల్చుకోగలిగింది. ఈమె ప్రతిభను గుర్తించిన కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం.. 1999లో ‘విశ్వశ్రేష్ట మహిళ’గా గౌరవించింది.

జీవిత చరిత్ర :

1958 జూలై 6న కర్ణాటకలోని ఉడిపి జిల్లా కోట గ్రామంలో మాలతి జన్మించింది. ఈమె తండ్రి హోటల్ నడుపుతుండేవారు. 14 నెలల వయస్సులో వుండగానే జ్వరం రూపంలో పాప పక్షవాతానికి గురికావడం కుటుంబసభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఆమెను మద్రాస్‌లోని అడయార్‌ ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో చేర్పించారు. రెండు సంవత్సరాలు రకరకాల చికిత్సలు, కరెంట్ షాక్‌లూ ఇచ్చారు. అలా చికిత్సం అందించడంతో ఆమె శరీర పైభాగానికి శక్తి వచ్చింది. కాని క్రింది భాగంలో ఏ మార్పూ లేదు.

15 ఏళ్ళు ఆమె జీవితం హాస్పిటళ్ళు, ఆపరేషన్లు, డాక్టర్ల చుట్టూనే తిరిగింది. ఈ 15 ఏళ్లలో ఆమె 27 ఆపరేషన్లు చేయించుకుంది. ఎన్ని ఆపరేషన్లు చేసినా శరీరం క్రింద భాగంలో ఎటువంటి మార్పు రాకపోవడంతో శక్తి ఉన్న భాగంతోనే ఎన్నో తన చదువు కొనసాగించింది. హైస్కూల్‌ చదువు పూర్తి అయ్యేంతలో, మాలతి నడుము పైభాగం బలపడింది. ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ తన కాలేజీ విద్యను పూర్తి చేసింది. తండ్రి ప్రోత్సాహంతో, కాలేజీ యాజమాన్యం సహకారంతో ఆమె తనూ ఏదైనా చేయగలన్న నూతనోత్సాహంతో ముందుకు నడిచింది.

క్రీడా జీవితం

1975లో బెంగుళూరులో జరిగిన వికలాంగుల క్రీడాపోటీలలో మాలతి మొదటిసారి పాల్గొంది. అందులో ఆమె రెండు బంగారు పతకాలు సాధించి తన సత్తా చాటింది. అలాగే 100 మీటర్లు, 200వ మీటర్ల వీల్‌ఛేర్‌ పరుగు పందాలలో తన ప్రతిభ కనబరచింది. వీల్‌ ఛైర్‌లో కూచునే బ్యాడ్‌మింటన్‌, షాట్‌ ఫుట్‌ విసరటం, డిస్క్‌త్రో, జావ్‌లిన్‌ విసరటం వంటివి ప్రాక్టీస్ చేసి.. ఆ ఆటల పోటీల్లో అనేక బంగారు పతకాలు గెలుపొందింది.

1989లో డెన్మార్క్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీలలో 4 బంగారు పతకాలు అందుకొంది. పలు దేశాలలో జరిగిన ఆటల పోటీలలో పాల్గొని ఇప్పటికీ 158 బంగారుపతకాలతోపాటుగా 20 రజితపతకాలుకూడా ఈమె సాధించింది. క్రీడారంగంలో అత్యధిక పతకాలను గెలుచుకొన్న వికలాంగ వ్యక్తిగా సరికొత్త రికార్డు సృష్టించింది. వికలాంగురాలైనప్పటికీ క్రీడారంగంలోని అనేక పోటీల్లో అద్భుతంగా ఈమె రాణించడాన్ని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది.

ఈ విధంగా క్రీడారంగంలో తన సత్తాచాటిన ఈమెను 1999లో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం ‘విశ్వశ్రేష్ట మహిళ’గా గౌరవించింది. అలాగే భారత ప్రభుత్వం ఈమెను ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. క్రీడాశాఖ ‘అర్జున’ అవార్డుతో సత్కరించింది.

వ్యక్తిగత జీవితం :

ప్రస్తుతం ఈమె బెంగుళూరులోని బసవేశ్వర నగర సిండికేట్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌లో ఆఫీసరుగా పనిచేస్తున్న ఈమె... వికలాంగుల కోసం ‘మాత్రు పౌండేషన్’ అనే పేరుతో ఆశ్రమం, క్రీడా శిక్షణ కేంద్రం నెలకొల్పి నిర్వహిస్తున్నారు. దీనిలో సుమారు 16 మంది వికలాంగ విధ్యార్దినీ, విద్యార్ధులు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : malathi krishnamurthy holla  indian famous athletes  indian sportspersons  

Other Articles