The Best healthy Dry Fruits for working women | health tips

Best healthy dry fruits for working women

dry fruits health benefits, dry fruits benefits, dry fruits news, dry fruits health, health tips, healthy foods, nuts benefits, working women

Best healthy Dry Fruits for working women : Dry fruits are best healthy foods for women in which number of nutrients help them to stay fit.

వర్కింగ్ వుమెన్స్ తీసుకోవాల్సిన హెల్దీ ఫుడ్స్

Posted: 06/27/2015 12:52 PM IST
Best healthy dry fruits for working women

వర్కింగ్ వుమెన్స్ ఇంట్లో కార్యకలాపాలు నిర్వహించుకోవడంతోపాటు ఆఫీసు పనులు చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. దీంతో వారికి మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతాయి. వ్యాధినిరోధక శక్తి తగ్గి నీరసంగా మారిపోవడం, నొప్పులు, తలనొప్పి.. ఇలా ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యల్ని అధిగమించాలంటే పోషకాహారం తీసుకోవడం ఎంతో ఉత్తమం! ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటివి తీసుకుంతే ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే.. శరీరానికి కావలసిన విటమిన్స్, న్యూట్రీషియన్స్, మినరల్స్ వంటివి వాటిలో పుష్కలంగా వుంటాయి.

డ్రై ఫ్రూట్స్, నట్స్ లలో ఫైబర్ అధిక మోతాదులో వుంటుంది. అది మలబద్దకం సమస్యల్ని నివారించడంలో కీలకపాత్ర వహిస్తుంది. జీర్ణక్రియను మరింత మెరుగ్గా చేస్తుంది. శరీరం అనీమియాకు గురికాకుండా చేస్తుంది. ఇలా ఎన్నోరకాల ఉపయోగాలు ఈ డ్రై ఫ్రూట్స్, నట్స్ లలో వుండే పోషకాల ద్వారా కలుగుతాయి. మరి.. ఏయే ఆహారంతో ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందామా..

1. బాదం : ఇందులో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. ఇది హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది. కాబట్టి.. పనిచేసే ఉద్యోగినులు ప్రతి రోజూ ఉదయం బాదం తింటే.. శరీరంలో ఒత్తిడి తగ్గిస్తుంది.
2. జీడిపప్పు-డ్రై ఆఫ్రికాట్ : ఈ రెండింటిలో కాపర్ పుష్కలంగా ఉంది. ఇది శరీరంలో ఐరన్ నిల్వచేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. కండరాలు గ్రేట్ గా పనిచేయడానికి దోహదపడుతుంది.
3. డేట్స్ అండ్ ఫిగ్స్: శరీరానికి అవసరం ఫైబర్ ఈ రెండూ అందిస్తాయి. ఇవి హార్ట్ డిసీజ్, డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా నివారిస్తాయి. బరువును కంట్రోల్లో ఉంచడంతోపాటు జీర్ణక్రియను మెరుగుపచడంలో గొప్పగా సహాయపడుతాయి.
4. పిస్తాచో : శరీరానికి ఎంతో అవసరమయ్యే మెగ్నీషియం ఇందులో పుష్కలంగా వుంటుంది. ఇది ఎముకలు స్ట్రాంగ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే.. జీవక్రియలను, థైరాయిడ్, బ్లడ్ షుగర్ ను రెగ్యులేట్ చేస్తుంది.
5.వాల్ నట్స్ : వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ప్రెగ్నెంట్ మహిళలకు చాలా గొప్పగా ఉపయోగపడుతాయి. పొట్టలో పెరిగే శిశువు మెదడు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి.
6. ఎండు ద్రాక్ష : దంతక్షయాన్ని దూరం చేయడంలో ఎండు ద్రాక్ష గ్రేట్ గా సహాయపడుతుంది. దంతాలు, కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ ద్రాక్ష దోహదం చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dry fruits  health tips  working women  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more