Neeraj Chopra tops qualifiers with 86.65m throw భారత్ ఖాతాలో తొలి స్వర్ణం.. జావెలిన్ త్రోలో నీరిజ్ చోఫ్రా సంచలనం..

Olympics neeraj chopra qualifies for javelin throw final with first attempt of 86 65m

neeraj chopra, tokyo 2020 neeraj chopra, mens javelin tokyo 2020, Neeraj Chopra in tokyo 2020, Javelin Thrower Neeraj Chopra, Neeraj Chopra medal, olympic games update, latest olympic news, olympic sports, olympic games olympic games 2020, olympic updates, olympics 2020

Neeraj Chopra won Gold in the Men’s Javelin Throw final to win Independent India’s first medal in Athletics. This is India’s 7th medal at Tokyo 2020, the best ever medal haul for India at a single edition of the Games. Neeraj Chopra’s Gold is also India’s second-ever individual Gold medal at the Olympics, after Abhinav Bindra in Shooting.

భారత్ ఖాతాలో తొలి స్వర్ణం.. జావెలిన్ త్రోలో నీరిజ్ చోఫ్రా సంచలనం..

Posted: 08/07/2021 05:47 PM IST
Olympics neeraj chopra qualifies for javelin throw final with first attempt of 86 65m

టోక్యో ఒలంపిక్స్ లో భారత చరిత్రను తిరిగరాసిన ధీరుడు నీరజ్ చోప్రా. పురుషుల జావెలిన్ త్రో విభాగంలో తన ప్రత్యర్థులను చిత్తు చేసి.. భారతమాత సిగలో స్వర్ణ పతకాన్ని సాధించిన సాధారణ రైతు బిడ్డ. ఒలంపిక్స్ చరిత్రలో భారత్ అథ్లెటిక్స్ లో తొలి స్వర్ణం సాధించాడు చోప్రా. ఒలింపిక్స్ లో భారత్ కు ఇప్పటివరకు ఇతర క్రీడాంశాల్లో స్వర్ణం అందినా, అథ్లెటిక్స్ స్వర్ణం అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. ఇప్పుడు నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనతో భారత క్రీడారంగానికి ఆ లోటు కూడా తీరిపోయింది.

ఇవాళ జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్ లో తిరుగులేని బలంతో ప్రత్యర్థులను వెనక్కి నెట్టిన చోప్రా.. క్వాలిఫికేషన్ గ్రూప్​-ఏలోనే 86.65 మీటర్లు మేర తన బెల్లాన్ని విసిరి నేరుగా ఫైనల్‌కు చేరాడు. తొలి ప్రయత్నంలోనే అతను రికార్డు స్థాయిలో 86.65 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ను విసిరాడు. ఇక ఇవాళ జరిగిన ఫైనల్స్ లోనూ ఆయన తన ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. తొలి రౌండ్ లో తన బెల్లాని ఏకంగా 87.03 విసిరి తన సత్తాను చాటాడు. ఇక రెండో రౌండ్ లో తొలి రౌండ్ కన్నా మెరుగ్గా తన బలన్ని పుంజుకుని 87.58 మీటర్ల మేర విసిరాడు.

ఇక మూడవ రౌండ్ లో తన ప్రత్యర్థులతో సమానంగా తన బెల్లాన్ని విసరిన నీరజ్ కేవలం 76.79 మీటర్ల మేర మాత్రమే బెల్లాని విసిరాడు. ఆ తరువాత 4, 5 రౌండ్లలో పెద్దగా సత్తా చాటకపోయినా ఆరవ రౌండ్ లో 84.24 మేర విసిరాడు. కాగా తన బెస్ట్ 87.58 నమోదు కావడం.. అదే ఒలంపిక్స్ లో పాల్గోన్న జవెలిన్ త్రో విభాగంలోనే ఉత్తమమైనదిగా నిలవడంతో నెంబర్ వన్ ర్యాంకర్ గా నిలిచాడు. దీంతో పోటీలు పూర్తైన తరువాత ఆయనకు స్వర్ణ పతకం లభించింది. నీరజ్ చోప్పా సాధించిన ఈ బంగారు పతకం.. వ్యక్తిగత విభాగంలో రెండవది. షూటింగ్ లో అభినవ్ బింద్రా గతంలో దేశానికి స్వర్ణం సాధించిపెట్టాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Neeraj Chopra  Tokyo Olympics 2020  Javelin Thrower  Indian Arthlete  sports  

Other Articles