P V Sindhu Is Showered With Well-Deserved Accolades!

P v sindhu is showered with well deserved accolades

Olympics 2016, India, Badminton, Rio 2016 Badminton, PV Sindhu, Chandrababu, KCR, Telangana, AP Government, Badminton, Carolina Marin, India, Japan, Laura Sarosi, Nozomi Okuhara, Olympics 2016, PV Sindhu, Rio 2016, Rio Olympics 2016, olympics news

P V Sindhu home states of Andhra Pradesh and Telangana are preparing for her to come back home to pamper their champion.

పివీ సింధుకు తెలంగాణ, ఆంద్ర ప్రభుత్వాల నజరానా.!

Posted: 08/20/2016 07:48 PM IST
P v sindhu is showered with well deserved accolades

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూకు బహుమతుల వర్షం కురుస్తోంది. ఆమెకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలకాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. శంషాబాద్ నుంచి మహెదీపట్నం మీదుగా ర్యాలీ నిర్వహించాలని కూడా తలపించింది. దీనికి తోడు రజత పతక విజేతకు 5 కోట్ల రూపాయల ప్రోత్సాహక బహుమతి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు, ఆమె ఎటూ హైదరాబాద్‌లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడే ఆమెకు వెయ్యి గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని.. అలాగే ఆమె చేస్తానంటే ఆమెకు తగిన ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.

ఇప్పటివరకు ఎంతోమంది ఛాంపియన్లను కోచ్ పుల్లెల గోపీచంద్ తయారుచేశారని, ఆయన చేతుల మీదుగానే సింధుతో పాట సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల, కిదాంబి శ్రీకాంత్ లాంటి క్రీడాకారులు వచ్చారని.. ఈ రంగంలో ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు కోటి రూపాయల ప్రోత్సాహక బహుమతి ఇస్తామని చెప్పారు. ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన హరియాణా క్రీడాకారిణి సాక్షి మాలిక్‌కు కూడా తెలంగాణ తరఫున కోటి రూపాయల ప్రోత్సాహకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒలంపిక్స్ లో రజత పతక విజేతకు భారీ నజరానా ప్రకటించింది. రూ.3 కోట్ల నగదు, ఏపీ రాజధాని అమరావతిలో వెయ్యి గజాల స్థలంతో పాటు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే కోచ్ గోపిచంద్కు రూ.50 లక్షల బహుమతిని ఏపీ సర్కార్ ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల్లోపు సింధూతో పాటు గోపీచంద్ ను ప్రభుత్వం సన్మానించనుంది. అలాగే సాక్షి మాలిక్ కు రూ.50 లక్షల బహుమతి ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pv sindhu  India  rio olympics  badminton  Chandrababu  KCR  Telangana  AP  

Other Articles