Report: Messi rethinks Argentina retirement, to return in November

Argentina fans plead for messi to reconsider

lionel messi,lionel messi argentina,leo messi,lionel messi retirement,lionel messi argentina retirement,lionel messi international retirement,lionel messi argentina return

Lionel Messi had reconsider his decision on retirement from international career, may return into team movembet

పునర్నిర్ణయం తీసుకోన్న మెస్సీ.. మళ్లీ జట్టులోకి ఆగమనం..

Posted: 07/03/2016 10:05 PM IST
Argentina fans plead for messi to reconsider

ప్రతిష్టాత్మక కోపా అమెరికా టోర్నమెంటులో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు ఓటమి కావడంతో తన అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలుకుతూ అ మ్యాచ్ ముగిసీ ముగియగానే ప్రకటించిన అర్జెంటీనా జట్టు కెప్టెన్ లీయోన్ మెస్సీ తన నిర్ణయాన్ని పున: సమీక్షించుకున్నాడు. అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ అర్జెంటీనా ప్రజలు, అభిమానులు అనునిత్యం తనను జట్టులోకి తిరిగి రావాలంటూ కోరడంతో ఆయన కూడా అందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ ఏడాది నవంబర్ లో తాను జట్టులోకి తిరిగి వస్తానని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.
 
ఇప్పుడు మెస్సీ పునరాగమనం కోసం అభిమానులు పెద్ద ఎత్తున కదిలారు. అందుకు శనివారం బ్యూనోస్ ఎయిర్స్ లో  భారీ ర్యాలీ నిర్వహించారు. ఓ వైపు వర్షం కురుస్తునా లెక్క చేయకుండా మెస్సీపై అభిమానాన్ని చాటుకున్నారు.  మెస్సీ తీసుకున్న వీడ్కోలు నిర్ణయం ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదంటూ గళం కలిపారు. అర్జెంటీనా జట్టులో ఆ స్టార్ ఆటగాడ్ని తిరిగి చూడాలంటూ అతనికి మద్దతు కూడగట్టే యత్నం చేశారు.అందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా వందల సంఖ్యలో అభిమానులు రోడ్లపైకి వచ్చారు.

ఇటీవల కోపా అమెరికా టోర్నీలో ఫైనల్లో అర్జెంటీనా ఓటమి పాలైన తరువాత ఆ జట్టు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్కు గుడ్ బై చెప్పాడు. చిలీతో మ్యాచ్ సందర్భంగా పెనాల్టీ షూటౌట్లో గోల్ చేయడంలో విఫలమైన మెస్సీ జట్టు ఓటమికి కారణమయ్యాడు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుకు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. కాగా, అతని వీడ్కోలు నిర్ణయాన్ని మాత్రం ఎవరూ స్వాగతించలేదు. అటు మెస్సీపై  తీవ్ర విమర్శలు గుప్పించిన ఆ దేశ దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా సైతం వీడ్కోలు నిర్ణయం సరైనదికాదని అభిప్రాయపడ్డాడు.

తన నిర్ణయాన్ని మార్చుకుని జట్టులో కొనసాగాలని విన్నవించాడు. మరోవైపు బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే కూడా మెస్సీ తప్పు చేస్తున్నాడంటూ  హితబోధ చేశాడు. ఒక మ్యాచ్లో ఓటమితో  శాశ్వతంగా జట్టు నుంచి వైదొలగడం మంచి నిర్ణయం కాదన్నాడు. గత పదేళ్లుగా చాంపియన్ గా ఉన్న మెస్సీ... అంతర్జాతీయ వీడ్కోలు నిర్ణయాన్ని మార్చుకుని జట్టులో కొనసాగాలని విజ్ఞప్తి చేశాడు. కోపా అమెరికా ఫుట్ బాల్ కప్ తుది పోరులో అర్జెంటీనా జట్టు ఓటమికి మెస్సీ కారణమైనా అతని వీడ్కోలు నిర్ణయాన్ని మాత్రం ఆ దేశ ప్రజలు స్వాగతించకపోవడం విశేషం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lionel Messi  Argentina  foot ball  soccer  

Other Articles