Ajay Jayaram, B Sai Praneeth reach semifinals of Canada Open

Shuttlers jayaram praneeth progress to canada open semis

ajay jayaram, b sai praneeth, canada open, harsheel dani, lee hyun il, brice leverdez, linda zetchiri, manu attri, b sumeeth reddy, jwala gutta, ashwini ponnappa, jakkampudi meghana, s poorvisha ram, badminton, india badminton

Indian shuttlers Ajay Jayaram and B Sai Praneeth advanced to the semifinals of the USD 55,000 Canada Open Grand Prix badminton tournament.

కెనడా ఓపెన్: సెమీస్ లోకి జయరాం, ప్రణీత్

Posted: 07/02/2016 06:09 PM IST
Shuttlers jayaram praneeth progress to canada open semis

కెనడా గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు సాయి ప్రణీత్, అజయ్ జయరామ్లు సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జయరామ్ 21-18 19-21-21-8 తేడాతో భారత్ కే చెందిన హర్షిల్ డానిపై గెలిచి సెమీస్ కు చేరాడు. కేవలం 47 నిమిషాలపాటు జరిగిన పోరులో జయరామ్ ఆద్యంతం ఆకట్టుకుని సెమీస్ లో కి ప్రవేశించాడు. మరో క్వార్టర్ పోరులో నాల్గో సీడ్ సాయి ప్రణీత్ 21-14, 21-16 తేడాతో ఎనిమిదో సీడ్ రౌల్ మస్త్(ఎస్టోనియా)పై గెలిచి సెమీస్లోకి దూసుకెళ్లాడు.

తమ తదుపరి పోరులో లి హున్(కొరియా)తో జయరామ్ తలపడనుండగా, బ్రైస్ లివర్డెజ్(ఫ్రెంచ్)తో సాయి ప్రణీత్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇదిలా ఉండగా, భారత ఆటగాడు, రెండో సీడ్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్స్ లో ఓటమి పాలయ్యాడు. ప్రణయ్ 22-20, 21-23, 18-21 తేడాతో  లివర్డెజ్పై పరాజయం చెందాడు. మరోవైపు రియో ఒలంపిక్స్ లో పాల్గోననున్న వుమెన్ డబుల్స్ జోడీ గుత్తా జ్వాలా, అశ్వనీ పోన్నప్పలు అస్ట్రేలియా, కెనడా జోడి లీయాన్నీ చో, రాచల్ హోండరిచ్ లకు వాక్ ఓవర్ ఇచ్చేశారు. ఇక మిక్సిడ్ డబుల్స్ లోనూ మను, అశ్వనీలు స్వీడన్ జోడి చేతిలో ఓటమిపాలయ్యారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajay Jayaram  Sai Praneeth  Canada Open Tournament  badminton  

Other Articles