Ayonika Paul : I always love to play with a bit of pressure

Ayonika paul gears up for rio olympics

Rio Olympics 2016, Rio Olympics, Ayonika Paul, 10 meters air rifle event, sport, shooting, sports event, Olympics

Indian shooter Ayonika Paul, who will represent the country at the Rio Olympics, today said she thrives under pressure and is now focusing on polishing her technique ahead of the Games.

ఒత్తిడిలో అడటమే ఇష్టం.. టెక్నిక్ కు పదను..

Posted: 06/28/2016 05:36 PM IST
Ayonika paul gears up for rio olympics

ఆసియా క్వాలిఫయింగ్ రౌండ్లో రజత పతకంతో మెరిసిన భారత షూటర్ అయోనికా పాల్.. త్వరలో బ్రిటెన్ లో జరగనున్న రియో ఒలంపిక్స్ లో తాను ఒత్తిడిలో వున్నప్పుడూ మెరుగైన ప్రదర్శనను ఇస్తానని ఖచ్చితంగా చెప్పేసింది. రియో ఒలింపిక్స్ కు  తాను పూర్తి సంస్ధిద్దంగా వున్నానని పేర్కొంటూనే.. తన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంతో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపింది. దీనిలోభాగంగానే తన సాంకేతికతకు మెరుగులు దిద్దుతున్నట్లు అయోనికా వెల్లడించింది. పలు దేశాల నుంచి పాల్గొనే ఆ మెగా ఈవెంట్లో ఒత్తిడి అధికంగా ఉంటుందని, అయితే దాన్ని అధిగమిస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది.

'రియోకు కచ్చితమైన ప్రణాళికలతో సిద్ధమవుతున్నా. చదవడానికి ఏ రకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానో, అదే రకంగా రియోకు సన్నద్ధమవుతున్నా. నాకున్న కొద్దిపాటి అనుభవంతో ఒత్తిడిని అధిగమిస్తా. నాకు సాధారణంగా ఒత్తిడిలో ఆడటమంటే ఇష్టం. అంతకుముందు కూడా ఇదే తరహాలో ఒత్తిడిని జయించా. ప్రస్తుతం నా టెక్నిక్కు సానబడుతున్నాను' అని అయోనికా స్పష్టం చేసింది. 2014 లో గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో కూడా రజతంతో మెరిసిన అయోనికా పాల్.. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన అసియా క్వాలిఫయింగ్ రౌండ్ లోనూ రజతాన్ని సాధించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ayonika Paul  10 meters air rifle event  Rio Olympics 2016  Rio Olympics  shooting  sports  

Other Articles