Saina Nehwal wins Australian Open Super Series title

Saina nehwal trumps sun yu to bag second australian open title

saina nehwal, nehwal india, india nehwal, australian open, australian open news, saina nehwal australian open, sports news, sports, badminton news, badminton

Saina Nehwal registered a win in the Australian Open final against Sun Yu. She won 11-21, 21-14, 21-19.

అస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ లో మెరిసన సైనా నెహ్వాల్

Posted: 06/12/2016 04:11 PM IST
Saina nehwal trumps sun yu to bag second australian open title

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మళ్లీ మెరిసింది. గత కొంత కాలంగా సెమీ ఫైనల్స్ అడ్డుగోడను దాటలేకపోయిన సైనా.. తన అద్బుత అటతీరుతో మళ్లీ టైటిల్ ను అందుకుంది. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సైనా ఎట్టకేలకు మళ్లీ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్న సైనా ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ ను దక్కించుకుంది. మహిళల సింగిల్స్ లో భాగంగా ఆదివారం జరిగిన తుది పోరులో సైనా 11-21, 21-14, 21-19 తేడాతో ప్రపంచ 12 ర్యాంకర్ సున్ యు(చైనా)పై గెలిచి ట్రోఫీని సాధించింది.

తొలి గేమ్ లో అనవసర తప్పిదాలు చేసిన సైనా ఆ గేమ్ను కోల్పోయింది. ఆ తరువాత రెండో గేమ్లో పుంజుకుని అత్యంత నిలకడను ప్రదర్శించింది. ఈ గేమ్ ఆది నుంచి ఆధిపత్యం కొనసాగించిన సైనా ఆ గేమ్ను సాధించింది. ఆపై జరిగిన నిర్ణయాత్మక మూడో గేమ్లో సైనా పోరాడి గెలిచింది. చైనా క్రీడాకారిణి సున్ యు నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన సైనా కీలక దశలో ఆకట్టుకుని మూడో గేమ్ను స్వల్ప తేడాతో చేజిక్కించుకుంది.  తద్వారా సున్ యుతో ముఖాముఖి రికార్డులో సైనా 6-1తో మెరుగు పరుచుకోవడమే కాకుండా, రెండో సారి ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

2014లో సైనా ఈ టోర్నీలో తొలిసారి విజేతగా నిలిచి.. మళ్లీ ఇవాళ దానిని మరోమారు అందుకుంది. అయితే ఆస్ట్రేలియా ఓపెన్లో తన కంటే మెరుగైన ప్రత్యర్థులను సైనా మట్టికరిపించి టైటిల్ ను దక్కించుకుంది. ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ రాచనోక్, సెమీ ఫైనల్లో నాల్గో సీడ్ వాంగ్ యిహాన్ లపై గెలిచి ఫైనల్ కు చేరింది.  తుది పోరులె సున్ యు పై ఉన్న మెరుగైన రికార్డును మరింత మెరుగుపరుచుకున్న సైనా టైటిల్ ను సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saina nehwal  australian Super Series  Indian shuttler  Badminton tournament  

Other Articles