Shuttler PV Sindhu battles into Macau Open final

Sindhu enters macau open semis

PV Sindhu, Macau Open Grand Prix Gold, HS Prannoy, Akane Yamaguchi, Ace Indian shuttler PV Sindhu, Japan's Akane Yamaguchi, He Bingjiao, Minatsu Mitani, Badminton

Two-time defending champion PV Sindhu stayed on course to retain her women’s singles title as she entered the semifinals of the $120,000 Macau Open Grand Prix Gold on Friday with a hard-fought three-game win over China’s Chen Yufei.

మకావు ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సింధు

Posted: 11/28/2015 06:33 PM IST
Sindhu enters macau open semis

డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు మకావు ఓపెన్ గ్రాండ్ఫ్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. మకావు ఓపెన్ లో తన ఛాంఫియన్ షిప్ టటైటిల్ ను మరోమారు నిలుపుకునేందుకు సింధూ మరో అడుగు దూరంలో వుంది. లక్షా ఇరవై వేల అమెరికన్ డాలర్లు బహుమతిగా ప్రకటించిన మకావు ఓపెన్ గ్రాండ్ఫ్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సింధూ వెనక్కు తిరగకుండా దూసుకుపోతోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు టైటిల్ ను సాధించిన సింధూ మరో పర్యాయం ఈ టైటిల్ ను దక్కించుకునేందుకు చివరి అంకానికి చేరింది.

శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో చెన్ ను 21-13, 18-21, 21-14 తో ఓడించిన సింధూ.. అదే జోరుతో శనివారం సెమీ ఫైనల్స్ విజయాన్ని సాధించింది. జపాన్ చెందిన సయాకా సోటోను 21-13, 13-21, 23-21తో ఓడించిన జపాన్ క్రీడాకారిణి అకానే యామగచి సెమీస్ లో సింధూతో తలపడింది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఐదో సీడ్ సింధు 21-8, 15-21, 21-16 తో జపాన్ క్రీడాకారిణి అకానె యామగుచి పై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. టోర్నమెంట్ ఫైనల్ ఆదివారం జరగనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Sindhu  Macau Open Grand Prix Gold  HS Prannoy  Akane Yamaguchi  

Other Articles