PV Sindhu wins Macau Open Grand Prix Gold third year in a row

Sindhu wins macau open badminton tournament

PV Sindhu, Macau Open Grand Prix Gold, HS Prannoy, Sindhu Macau Open, Akane Yamaguchi, He Bingjiao, Minatsu Mitani. , Ace Indian shuttler PV Sindhu, Japan's Akane Yamaguchi, He Bingjiao, Minatsu Mitani, Badminton

Two-time defending champion P V Sindhu completed a hat-trick of women’s singles title at the Macau Open Grand Prix Gold after defeating Japan’s Minatsu Mitani in finals.

మకావు ఓపెన్ లో హ్యాట్రిక్ తో మెరిసిన సింధూరం

Posted: 11/29/2015 02:32 PM IST
Sindhu wins macau open badminton tournament

తెలుగు తేజం సింధు మరోసారి అంతర్జాతీయ యవనికపై సంచలనం సృష్టించింది. వరుసగా మూడోసారి మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి సరికొత్త హ్యాట్రిక్  రికార్డు తన పేరున నమోదు చేసుకుంది. ఆదివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో జపాన్ కు చెందిన మినత్సు మితానిని మట్టికరిపించి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. 30 నిమిషాలు సాగిన మ్యాచ్ లో  సింధు 21- 9, 21- 23, 21- 14 తేడాతో మితానిని ఓడించింది. మొదటి సెట్ సునాయాసంగా గెలుచుకున్న సింధుకు రెండో సెట్ లో తడబడింది.

మితానిని నుంచి గట్టి పోటీ ఎదుర్కోని చివరకు గేమ్ పాయింట్ వరకు పోరాడిన సింధు తృటిలో (23-21) తేడాతో సంపూర్ణ విజయావకాశాన్ని కోల్పోయింది. ఆ వెంటనే తేరుకున్న సింధూ మ్యాచ్ గెలుపులో కీలకంగా మారిన మూడో గేమ్ ప్రారంభం నుంచి ధాటిగా ఆడి 21- 14తేడాతో గెల్చుకుని వరుసగా మూడో ఏడాది మకావు ఓపెన్ విజేతగా సంచలనం నమోదు చేసింది. కాగా మకావు ఓపెన్‌ 2013, 2014లలో విజేతగా నిలిచినఇ సిందూ.. 2015 టైటిల్ ను కూడా గెల్చుకోవడం ద్వారా అరుదైన 'హ్యాట్రిక్' నమోదు చేసింది

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Sindhu  Macau Open  Akane Yamaguchi  He Bingjiao  Minatsu Mitani.  

Other Articles

Today on Telugu Wishesh