Chess Legend Viswanathan Anand Wants Aamir Khan To Play His Role If A Movie Will Make On His Real Life | Bollywood Updates

Viswanathan anand wants aamir khan to play his role in his real life movie

viswanathan anand, chess legend of india, aamir khan, dangal movie news, dangal movie first look, aamir khan anand movie, chess legend anand movie, anand real life movie

Viswanathan Anand Wants Aamir Khan To Play His Role In His Real Life Movie : Chess Legend Viswanathan Anand Wants Aamir Khan To Play His Role If A Movie Will Make On His Real Life.

అమీర్ ఖాన్ వెంటపడ్డ ‘చెస్’ లెజెండ్

Posted: 09/21/2015 03:53 PM IST
Viswanathan anand wants aamir khan to play his role in his real life movie

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ పాలోయింగ్ ఎంతమేర వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతనితో కాసేపు ముచ్చటించేందుకు కొందరు ప్రముఖులు సైతం పడిగాపులు కాస్తుంటారు. ఇప్పుడు ఓ చెస్ లెజెండ్ కూడా ఇతని కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. అమీరే కావాలంటే అతన్ని ఒప్పించేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నాడు. ఇంతకీ ఆ చెస్ లెజెండ్ ఎవరనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. ఆనంద్. తన మేధోశక్తితో చాలాసార్లు అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ గా నిలిచిన ప్రముఖ వ్యక్తి. చెస్ రంగంలో అద్వితీయంగా రాణిస్తున్న ఆనంద్ కు అమీర్ తో పనేంటి? అని ఆలోచిస్తున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

బాలీవుడ్ లో క్రీడా నేపథ్యంతో సాగే సినిమాలు వరుసగా వస్తున్న విషయం తెలిసిందే! ముఖ్యంగా దేశంలో పేరుగాంచిన కొందరు క్రీడాకారుల నిజజీవితం ఆధారంగా ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. మరిన్ని సినిమాలు రాబోతున్నాయి కూడా! ఈ క్రమంలోనే చెస్ లెజెండ్ గా పేరుగాంచిన విశ్వనాథన్ ఆనంద్ జీవిత చరిత్ర ఆధారంగా కూడా చిత్రం రూపొందే అవకాశం వుండొచ్చు. ఈ ప్రశ్నను కొందరు మీడియా ప్రతినిధులు సంధించగా.. ఆనంద్ తన మనసులోని మాటను వ్యక్తపరిచారు. ఒకవేళ తన జీవిత చరిత్ర ఆధారంగా భవిస్యత్తులో ఓ సినిమా రూపొందితే.. తన పాత్రను అమీర్ ఖానే చేయాలని ఆయన కోరుకున్నారు. అమీర్ చేస్తేనే తన పాత్ర బాగుంటుందని, సహజంగా అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. ‘ఇండస్ట్రీలో ఇంకా చాలామంది స్టార్ హీరోలుండగా.. అమీర్ ఖానే ఎందుకు?’ అనే ప్రశ్నకు ఆనంద్ బదులిస్తూ.. అమీర్ చెస్ బాగా ఆడతారని, పాత్రలో ఆయనే సహజంగా ఒదిగిపోతారని పేర్కొన్నాడు. ముంబైలో జరిగిన ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పై విధంగా స్పందించారు.

ఇదిలావుండగా.. ప్రస్తుతం అమీర్ రెజ్లింగ్ క్రీడపై తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే.. ఓ సందర్భంలో ‘చందరంగం’పై కూడా ఓ సినిమా తీసే ఆలోచనలో వున్నట్లు ప్రకటించాడు. దీని ప్రకారం.. ఆనంద్ పాత్రలో అమీరే నటించే అవకాశం చాలావరకు వుందని బాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chess legend viswanathan anand  aamir khan dangal  

Other Articles